టాలీవుడ్ యంగ్ హీరో ప్రణం దేవరాజ్, సుమన్, రవి శివతేజ ప్రధాన పాత్రల్లో ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని శంకర్ దర్శకత్వంలో పి.హరికృష్ణ గౌడ్ నిర్మిస్తున్నారు. ఈ మూవీని కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. హరి క్రియేషన్స్ ప్రొడక్షన్ పై మొదటి చిత్రంగా తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కనున్న ఈ చిత్రం పూజ కార్యక్రమాలతో ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తనికెళ్ల భరణి తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ముహూర్తపు సన్నివేశానికి ఆకాష్ పూరి క్లాప్ కొట్టగా, దేవరాజ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
Advertisement
తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. సినిమా అంటే చాలా ప్యాషన్ ఉండాలి. హరి క్రియేషన్స్ బ్యానర్ ని స్థాపించి నిర్మాణ రంగంలోకి రావడం ఆనందంగా ఉంది. దేవరాజ్ ఎన్నో అవార్డులు సాధించారు. ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకొని వాళ్ళ అబ్బాయి ప్రాణం దేవరాజ్ ఈ రంగంలోకి రావడం చాలా సంతోషంగా ఉంది. శంకర్ చాలా ప్రతిభ గల దర్శకుడు. ఈ చిత్రం పెద్ద విజయం సాధించి అందరికీ పేరు ప్రతిష్టలు రావాలి అని కోరారు.
దర్శకుడు శంకర్ మాట్లాడుతూ.. ఇది నా మొదటి సినిమా. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత హరి గౌడ్ కు ధన్యవాదాలు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉండే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. తెలుగు, కన్నడ ఏకకాలంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. మొదటి షెడ్యూల్ జనవరి మూడో వారం నుంచి హైదరాబాద్, ఆ తర్వాత వైజాగ్ పరిసర తెరకెక్కించనున్నాం అని తెలిపారు. హీరో ప్రణం మాట్లాడుతూ.. ఇది తెలుగులో నాకు మూడో చిత్రం. చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. మంచి లవ్ స్టోరీ, యాక్షన్ సినిమా. మీ అందరి ప్రోత్సాహం కావాలి అని కోరారు. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!