Home » కొత్త ఏడాదిలో గుడ్ న్యూస్ చెప్పిన అల్లు అర్జున్ హీరోయిన్..!

కొత్త ఏడాదిలో గుడ్ న్యూస్ చెప్పిన అల్లు అర్జున్ హీరోయిన్..!

by Anji
Ad

సాధారణంగా కొత్త ఏడాది ప్రారంభంలోనే కొత్త కొత్త సంఘటనలు చోటు చేసుకుంటాయనే విషయం మనకు తెలిసిందే. అయితే సినిమాల పరంగా కావచ్చు. వ్యక్తి గత పరంగానైనా.. ఇలా రకరకాలుగా చిత్ర, విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఈ ఏడాది ప్రారంభంలోనే హీరోయిన్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది.

Advertisement

ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్న ముద్దుగుమ్మ తాజాగా గర్భం ధరించినట్లు వెల్లడించింది. అయితే ఇప్పటికే అమలాపాల్ కు పెళ్లి కాగా.. తన ప్రియుడు జగత్ దేశాయ్ ను వివాహం చేసుకుంది. తాజాగా తాను ప్రెగ్నెన్సీ తో ఉన్నానంటూ ఇన్ స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ శుభవార్త తెలుసుకున్న ఫ్యాన్స్ ఆమెకు అభినందనలు చెబుతున్నారు. గత ఏడాది జూన్ నుంచే డేటింగ్ లో ఉన్న అమలాపాల్ నవంబర్ లో పెళ్లి చేసుకుంది.

 

 బ్లెస్సీ దర్శకత్వంలో పృధ్వీరాజ్ సుకుమారన్ జంటగా ఆడుజీవితంలో అమలాపాల్ కనిపించనుంది. ఆ తర్వాత ద్విజ అనే మరో మళయాల చిత్రంలో నటిస్తోంది. అమలాపాల్ తెలుగులో స్టార్ హీరోలు అందరితో నటించింది. అల్లు అర్జున్ కు జంటగా ఇద్దరమ్మాయిలతో సినిమాలో మెప్పించింది. కాగా, హీరోయిన్ అమలాపాల్ తన ప్రియుడు ఈవెంట్ మేనేజర్ జగత్ దేశాయ్ ను పెళ్లాడింది. కేరళలోని కొచ్చిలో నవంబర్ ఐదున వీరి వివాహం ఘనంగా జరిగింది. అయితే గతంలో మలయాళ డైరెక్టర్ విజయ్ ను పెళ్లాడిన భామ ఆ తర్వాత మనస్పర్ధలతో విడిపోయింది.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading