సాధారణంగా దాదాపు అందరూ ఉదయం నిద్ర లేవగానే బ్రష్ చేసుకొని.. టీ, కాఫీలు, టిఫిన్ చేస్తూ ఉంటారు. అయితే ఈ బ్రేక్ ఫాస్ట్ విషయంలో మాత్రం చాలామంది కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. అదేంటి.. అంటే బ్రేక్ ఫాస్ట్ తీసుకునే ఆహార విధానంలో కొన్ని తప్పులు చేస్తున్నారు. తినకూడని ఆహార పదార్థాలు కూడా ఉదయం తింటున్నారు. ఇలా తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అసలు మనం ఉదయం తినకూడని ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కొంతమంది బిస్కెట్లు, బ్రెడ్లు తింటూ ఉంటారు. ఇది కూడా మంచిది కాదు. దీని వలన శక్తి తగ్గుతుంది. దీనివల్ల డిహైడ్రేషన్ కూడా వస్తుంది. బిస్కెట్లు, బ్రెడ్స్ తింటే తలనొప్పి కూడా పెరుగుతుంది. దీనివల్ల ఉదయాన్నే శక్తి తగ్గడంతో పాటు ఎస్టిటి సమస్యలు వస్తాయి. కొంతమంది ఉదయాన్నే పాన్ కేక్స్ తింటూ ఉంటారు. ఇవి త్వరగా జీర్ణం అవుతాయి. కానీ, వీటిని తింటే శక్తి తగ్గుతుంది. వీటిని తినగానే ఇంకా స్వీట్స్ గ్రేవింగ్స్ పెరుగుతాయి. కాబట్టి వీటిని తినకపోవడమే మంచిది.కొంతమంది ఉదయాన్నే జ్యూస్ లు తాగుతారు. ఇది కూడా మంచి పద్ధతి కాదు. జ్యూస్ చేసేటప్పుడు అందులో పీచు తగ్గిపోతుంది.
Advertisement
ఇది రక్తంలో చక్కెర పరిమాణాన్ని పెంచుతుంది. మీరు షుగర్ వేయకపోయినా దీనివల్ల బాడీలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. షుగర్ పేషెంట్స్ కి ఇది మంచిది కాదు. కాబట్టి పండ్లను జ్యూస్ చేయకుండా అలాగే తినేయాలి. ఇది కూడా ఏదైనా సాలిడ్ ఫుడ్ తీసుకున్నాక తినడం మంచిది. ఉదయాన్నే టీ తాగితే కూడా అంత మంచిది కాదు. మీరు ఉదయాన్నే టీ తాగితే పొట్టలో యాసిడ్స్ పెరుగుతాయి. గుండెల్లో మంట, నొప్పి, మలబద్దకం లాంటి సమస్యలు తీసుకొస్తుంది. కాబట్టి ఉదయాన్నే టీ తాగడం కూడా అంత మంచిది కాదు. ఉదయాన్నే ఏమైనా తినాలంటే ఫైబర్ పోషకాలు ఎక్కువగా ఉండే ఫుడ్స్ తినడం చాలా మంచిది. అంటే నానబెట్టిన డ్రై ఫ్రూట్స్, ఓట్స్, మొలకలు ఇలా మంచి ఫైబర్ ఉన్న పదార్థాలు తినడం మంచిది.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!