Home » పెళ్లి పీటలు ఎక్కనున్న డెవిల్ హీరోయిన్..?

పెళ్లి పీటలు ఎక్కనున్న డెవిల్ హీరోయిన్..?

by Anji
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లానాయక్  సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది సంయుక్త మీనన్‌.  తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ  ఇచ్చినప్పటి నుంచి బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్లు అందుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. బింబిసార, సార్, విరూపక్ష, డెవిల్‌ చిత్రాలతో మరిన్ని హిట్లను తన ఖాతాలో వేసుకుంది. తెలుగు కంటే ముందుగానే మలయాళంలో నటించడంతో అక్కడ మరిన్ని హిట్లు ఖాతాలో వేసుకుంది.

Advertisement

దీంతో నిర్మాతలు కూడా ఈ ముద్దుగుమ్మ కోసం క్యూ కడుతున్నారు. దీంతో ఇటు తెలుగు, తమిళ చిత్రాలతో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే సంయుక్త మీద రూమర్లు కూడా షికారు చేస్తున్నాయి. రీసెంట్ గా ఓ రూమర్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. నిజానికి తెలుగు సహా తమిళంలో వరుస పెట్టి సినిమాలు చేసుకోస్తోంది సంయుక్త. ప్రస్తుతం సంయుక్త సినిమాలను తగ్గించింది. వ్యక్తిగత కారణాల వల్లనే  ఆమె కొత్త ప్రాజెక్టలను ఒప్పుకోలేదు. దీంతో ఆమె తన స్నేహితుడితో రిలేషన్‌ షిప్‌లో ఉందని కొన్ని రుమార్స్‌ షికార్‌ చేస్తున్నాయి. ఈ ఏడాదినే ఆమె తన ప్రియుడిని పెళ్లి చేసుకోబోతున్నట్లు సన్నిహితులు కొందరు చెబుతున్నారు. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు మొదలు పెట్టిందని తెలుస్తోంది.

సంయుక్త సూపర్ స్టార్‌ మహేష్‌ బాబు చిత్రం గుంటూరు కారంలో చిత్రంలో కూడా నటించనున్నట్లు…వార్తలు వినిపించాయి. అయితే ఆమె డెవిల్‌ చిత్రంలో తప్ప ఏ సినిమాలో కూడా కనిపించలేదు. అందుకు కారణం కూడా ఆమె పెళ్లినే అంటూ గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా కొంత కాలం క్రితం విడాకులు తీసుకున్న ఓ తమిళ నటుడితో ప్రేమలో ఉందంటూ వార్తలు వినిపించాయి. కానీ అవన్నీ కూడా వదంతులు అంటూ కొట్టి పారేసింది. తన స్నేహితుడితో డేటింగ్ లో ఉన్న సంయుక్త అతనిని పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఉందో లేదో తెలియాలంటే మాత్రం క్లారిటీ ఇస్తే గానీ తెలియదు.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading