ఈ మధ్యకాలంలో కరోనా పేరు పిలిస్తేనే ఎంతటి వారికైనా ముచ్చెమటలు పడుతుంటాయి. 2019 నుంచి ఈ మహమ్మారి మరణ మృదంగా మోగిస్తూనే ఉన్నది. ఈ వైరస్ రాకతో మన జీవితాలు కూడా పూర్తిగా మారిపోయాయి. వాస్తవానికి కరోనా వైరస్ వచ్చి రెండేండ్లు దాటినా ఇప్పటికీ దాని బంధీఖానాలోనే యావత్ ప్రపంచం బిక్కు బిక్కుమంటూ జీవిస్తున్నది. అయితే కొందరూ కరోనా కష్టకాలంలో వినూత్నంగా ఆలోచించి విభిన్న పనులకు నాంది పలుకుతూ ఉన్నారు. అయితే ఓ గృహిణి సరికొత్తగా ఆలోచించి పాకశాస్త్రంలో నూతన ఒడవడికను సృష్టించింది. ఏకంగా కరోనా వడలు తయారు చేసింది. కరోనా వడలా అని ఆశ్చర్యపోకండి. కరోనా వడల తయారీ ప్రస్తుతం నెట్టింట్లో తెర వైరలవుతోంది.
Advertisement
Advertisement
ఇటీవలే కూడా ఇలాంటి ప్రయోగం ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేసిన సంగతి తెలిసినదే. 2020లో కోల్‌కతాకు చెందిన స్వీట్ షాపు యజమాని కరోనా సందేశ్ స్వీట్ అనే డెజర్ట్‌ను తయారు చేశాడు. అయితే ప్రస్తుతం మాత్రం ఓ మహిళ కరోనా వడ అనే డిష్‌ను చేసినది. బియ్యంపిండిని మెత్తగా పిసికి ఆ తరువాత బంగాళదుంపలు, ఉల్లిపాయలు, టొమాటోలు, సగ్గుబియ్యంతో కరోనా వడలు తయారు చేశారు. పిండిలోపల సగ్గుబియ్యాన్ని నింపి, పచ్చి బియ్యంతో పూసి బాగా ఉడికించి ఆపై నీటిలో నానబెట్టిన బియ్యంతో చుట్టడంతో అది సరిగ్గా కరోనా వైరస్ స్పైక్లా కనిపిస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు వారి స్టైల్లో కామెంట్స్ చేస్తున్నారు.