మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవససరమే లేదు. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి అంచెలంచెలుగా మెగాస్టార్ గా ఎదిగారు. ఎంతో మందిని అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి చాలా మంది ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అగ్ర హీరోలు సైతం మెగాఫ్యామిలీలో ఉండటం విశేషం. ఇదిలా ఉంటే.. చిరంజీవి, ఆర్.నారాయణ మూర్తి నటించిన సినిమాల గురించి ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
చిరంజీవి సోలో హీరోగా ఎదుగుతూ అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ఆయన చేస్తున్న బ్రేక్ డ్యాన్సులకు థియేటర్లు షేక్ అయ్యేవి. చిరు చిత్రం వస్తుందంటే మెగాస్టార్ అభిమానులకు పండగే.. కటౌట్లు, బ్యానర్లతో హడావిడి. ఎన్నో ఆశలు పెట్టుకుని కోడిరామకృష్ణ డైరెక్షన్లో రిక్షావోడు చేసారు చిరంజీవి. అంతకు ముందు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలన్నీ సూపర్ డూపర్ హిట్స్. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, ఆలయ శిఖరం, గూఢచారి నెం.1, సింహపురి సింహం లాంటి చిత్రాలు వచ్చాయి. చాలా సంవత్సరాల గ్యాప్ తరువాత 1995 డిసెంబర్ 14న చిరుతో రిక్షావోడు తీసారు కోడి రామకృష్ణ. ఆ చిత్రంలో నగ్మ, సౌందర్య హీరోయిన్లు.
అదే ఏడాది నవంబర్ 9న ఆర్. నారాయణ మూర్తి హీరోగా పెట్టి దర్శక రత్న దాసరి ఒరేయ్ రిక్షా తీశారు. హీరోయిన్ రవళి నారాయణరావుకి జోడీగా నటించింది. చెల్లెలి సెంటిమెంట్ ప్రధానాంశంగా తీసుకుని చిత్రాన్ని రూపొందించారు దాసరి. అన్నగా ఆర్ నారాయణమూర్తి అద్భుతంగా నటించారు. దాసరి కూడా చాలా కాలం తర్వాత ఈ చిత్రంతో సూపర్ హిట్ కొట్టారు. ఇటు నారాయణమూర్తి రిక్షా, అటు చిరంజీవి రిక్షా.. రెండు చిత్రాలు బాక్సాఫీస్ బరిలో నిలిచాయి. అయితే ఈ రెండు సినిమాలు రిక్షా అనే టైటిల్‌తో రావడంతో ప్రేక్షులతో పాటు పరిశ్రమలోనూ ఉత్కంఠత నెలకొంది. బ్లాక్ బస్టర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన మెగాస్టార్ రిక్షా మాత్రం ప్రేక్షకులను కాస్త నిరాశ పరిచిందనే చెప్పాలి. అనూహ్యంగా నారాయణ మూర్తి రిక్షా ఊపు అందుకుంది. బాక్సాఫీస్ వద్ద కనక వర్షాన్ని కురిపించింది. ఈ సినిమా కోసం అప్పట్లో ప్రేక్షకులు టికెట్లు దొరక్క చాలా ఇబ్బంది పడ్డారట.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!