Home » రామ్ గోపాల్ వర్మ చనిపోయి 20 ఏళ్లు అయింది.. నాగబాబు సెన్షేషన్ కామెంట్స్..!

రామ్ గోపాల్ వర్మ చనిపోయి 20 ఏళ్లు అయింది.. నాగబాబు సెన్షేషన్ కామెంట్స్..!

by Anji
Ad

వివాదాలతో సహవాసం చేసే డైరెక్టర్  రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ గా తీసిన మరో వివాదాస్పద చిత్రం వ్యూహం.  ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న కొన్ని రాజకీయ పరిణామాలను అంశాలుగా తీసుకొని, జగన్ కి సపోర్టుగా, టీడీపీ, జనసేనకి వ్యతిరేకంగా చూపిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అయితే ఈ సినిమాకి వ్యతిరేకంగా టీడీపీ, జనసేన మద్దతుదారులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టిన సంగతి అందరికీ తెలిసిందే.

Advertisement

 

రీసెంట్ గా ఒకరు లైవ్ డిబేట్ కి వచ్చి, రామ్ గోపాల్ వర్మ తలనరికి తెచ్చి ఇచ్చేవాడికి బహుమానం అందిస్తాను అని ఛాలెంజ్ చేశాడు. దీనికి రామ్ గోపాల్ వర్మ నాకు ప్రాణహాని ఉందంటూ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశాడు. దీనికి జనసేన పార్టీ నేత కొణిదెల నాగబాబు చాలా వ్యంగంగా రెస్పాన్స్ ఇచ్చాడు. మీ ప్రాణాలకు ఎవరో హాని తలబడతారు అనే భయం అసలు అక్కర్లేదు రామ్ గోపాల్ వర్మ గారు. ఎందుకంటే హీరోలు విలన్లు కొట్టుకుంటుంటే మధ్యలో వచ్చే కమెడియన్ ని ఎవ్వరూ పట్టించుకోరు కదా. కాబట్టి నిశ్చింతగా ఉండండి అంటాడు. దానికి రాంగోపాల్ వర్మ సమాధానం చెబుతూ.. సార్ నాకంటే పెద్ద కమెడియన్ ఎవడంటే, నా సినిమాలో మీరు. ఎక్కువ ఆలోచించకుండా మీ తమ్ముడి దగ్గర డబ్బులు అడుక్కొని టీ తాగి పడుకోండి అంటూ కౌంటర్ ఇచ్చాడు.

దీనికి నాగబాబు ఫేస్ బుక్ లో ఇచ్చిన కౌంటర్ మామూలు రేంజ్ లో లేదు. చూస్తే రామ్ గోపాల్ వర్మ కి బీపీ పీక్ రేంజ్ కి చేరిపోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇంతకీ నాగబాబు దీనికి ఏమి కౌంటర్ ఇచ్చాడంటే వర్మ గారు మీరు నా పోస్ట్ కి స్పందించడం నాకు చాలా ఆనందంగా ఉంది. అంతే కాకుండా నేను షాక్ కి కూడా గురి అయ్యాను. ఎందుకంటే మీరు చనిపోయి 20 ఏళ్ళు అయ్యింది. కేవలం మీ ఆత్మ మాత్రమే ఇక్కడ తిరుగుతూ ఉంది. అది మీరు గ్రహించాలి. కానీ ఏదో ఒక రూపంలో నాకు సమాధానం ఇచ్చారు సంతోషం. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను అంటూ నాగబాబు పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీనికి రాంగోపాల్ వర్మ కౌంటర్ ఇస్తాడా, లేదా వదిలేస్తాడా అనేది చూడాలి.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading