సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉండే నటీనటులలో బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షిసిన్హా కూడా ఒకరు. నిత్యం తన గ్లామరస్, ఫ్యాషనబుల్ ఫొటోలతో పాటు తన సినిమాలు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నది. అదేవిధంగా తీరిక దొరికినప్పుడల్లా అభిమానులతో సరదాగా ముచ్చటిస్తుంటుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆస్క్ మీ క్వశ్ఛన్ పేరుతో ఓ ఛాటింగ్ సెషన్‌ను నిర్వహించినది.
Advertisement
అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం చెప్పింది. ఈ తరుణంలో ఓ నెటిజన్ మేడమ్ అందరూ పెళ్లి చేసుకుంటున్నారు. మరీ మీరు ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతారు..? అని ప్రశ్నించాడు. దీనికి స్పందించిన సోనాక్షి అందరూ కొవిడ్ బారిన పడుతున్నారు. నేను కూడా దానిని పొందాలా అంటూ తరదైన శైలిలో సమాధానం ఇచ్చింది సోనాక్షి. ఇటీవల కత్రినా కైఫ్ విక్కి కౌశల్, రాజ్‌కుమార్ రావు, పత్రలేఖ అంకిత లోఖండే- విక్కీ తదితరులు వరుసగా పెళ్లి పీటలు ఎక్కారు. ఈ నేపథ్యంలోనే సోనాక్షిని పెళ్లి గురించి ప్రస్తావించారు ఓ నెటిజన్.
Advertisement
సోనాక్షి సమాధానంపై మరొక నెటిజన్ మేడమ్.. మీరు ఎంతో రూడ్‌గా సమాధానాలు చెబుతున్నారు అని అడగగా.. అలాంటిది ఏమి లేదు. నా సెన్సాఫ్ హ్యుమర్‌ను చూపించాను అంతే అని చెప్పింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. చివరిగా భుజ్ ది ఫ్రైడ్ ఆఫ్ ఇండియాలో కనిపించింది సోనాక్షి. ప్రస్తుతం ఆమె రితేత్ దేశ్‌ముఖ్‌తో కలిసి కాకుడ సినిమాలో నటిస్తున్నది. అదేవిధంగా మరొకనటి హ్యుమాఖురేషితో కలిసి డబుల్ ఎక్స్ఎల్ చిత్రంలో నటిస్తున్నది.