పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా విడుదలైన సలార్ సినిమాతో మరోసారి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. అయితే అలాంటి పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్న ప్రభాస్ ప్రస్తుతం తన ఒక్కో సినిమాకి 100 కోట నుండి 150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఈయన భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
Advertisement
రీసెంట్ గా విడుదలైన సలార్ మూవీ ని పక్కన పెడితే ఈయన కల్కి 2898 డి , రాజా డీలక్స్ వంటి సినిమాలే కాకుండా ఇంకో రెండు పాన్ ఇండియా మూవీస్ కూడా చేస్తున్నారు. అయితే ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తూ వందల కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ప్రభాస్ మొదటి రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే మీరందరూ షాక్ అవ్వాల్సిందే.ఎందుకంటే ప్రభాస్ ఇప్పుడు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ కి మొదట్లో తీసుకున్న రెమ్యూనరేషన్ కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. మరి రెబల్ స్టార్ ప్రభాస్ తన మొదటి సినిమాకి తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రభాస్ కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీ లోకి ఈశ్వర్ అనే మూవీతో ఎంట్రీ ఇచ్చారు. 2002లో వచ్చిన ఈశ్వర్ మూవీకి జయంత్ సీ పరాంజీ దర్శకత్వం వహించారు.అలాగే అశోక్ కుమార్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. అయితే తన మొదటి సినిమా ఈశ్వరికి ప్రభాస్ తీసుకున్న రెమ్యూనరేషన్ కేవలం 5 లక్షలు మాత్రమే.ఇక ఈ విషయాన్ని స్వయంగా ప్రభాస్ గతంలో పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. అలాగే తనకి హీరో అవ్వాలి అనే ఇంట్రెస్ట్ అస్సలు లేదని,వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలి అనుకున్నారట.కానీ అనూహ్యంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా కొనసాగుతున్నారు.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!