పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన సలార్ మూవీ గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో సలార్ మూవీ ట్రెండింగ్ లో కొనసాగుతుంది. డిసెంబర్ 22న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. కానీ కేజీఎఫ్ రేంజ్ లో మాత్రం సెన్సేషనల్ హిట్ టాక్ అందుకోలేకపోయిందనే కొందరూ విమర్శిస్తున్నారు. ప్రధానంగా కొన్ని సన్నివేశాల్లో ప్రభాస్ యాక్షన్ సీన్స్ అదరగొట్టాయి. ఈ మూవీలో కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ చేసిన మూడు మైనస్లు ఈ సినిమాలో లేకుంటే సలార్ జవాన్ మూవీని మించి పోయేదని టాక్. ప్రశాంత్ నీల్ చేసిన ఆ మిస్టేక్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
ప్రభాస్ సినిమా అంటేనే ఎక్కువగా మాస్ ప్రేక్షకులు ఉంటారు. ఆ మాస్ ప్రేక్షకులు యాక్షన్ సీన్లను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ప్రభాస్ కి మాస్, క్లాస్ అని తేడా లేకుండా అభిమానులుంటారు. కానీ ఎక్కువగా మాత్రం మాస్ అభిమానులుండటం విశేషం. సలార్ మూవీకి యాక్షన్ సీన్లు ఆయువు పట్టు అనే చెప్పాలి. అయితే ఆ యాక్షన్ సన్నివేశాలను కొన్ని చోట్లా ఆశించిన స్థాయిలో ఎలివేట్ చేయడంలో ప్రశాంత్ నీల్ విఫలమయ్యాడు. ప్రబాస్ కి ఉన్న ఇమేజ్ వల్లనో లేక ప్రెజర్ వల్లనో కానీ.. అతడు ఆ సన్నివేశాలను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు.
ప్రధానంగా కొన్ని చోట్ల మరింత వైలెన్స్ సన్నివేశాలను జొప్పించాడు. సినిమాకే మొదటి మిస్టేక్ అని చెప్పాలి. అయితే క్యాన్సర్ స్టోరీ, వంశాల గురించి చెప్పే విషయంలో కూడా కాస్త స్పష్టత లోపించింది. అయితే వీటిని ప్రశాంత్ నీల్ చాలా వేగంగా చెప్పుకుంటూ పోయాడు. దీంతో కొందరికీ మాత్రమే అర్థం అయింది. కొందరు ఆడియన్స్ కి మెయిన్ పాయింట్ మిస్ కావడం జరిగింది. చివరికీ ప్రభాస్ పాత్ర విషయంలో కూడా ఫ్యాన్స్ లో కన్ఫ్యూజన్ ఏర్పడింది. మొత్తం మీద క్యారెక్టర్ గురించి సరిగ్గా చూపించడంలో ప్రశాంత్ విఫలమయ్యాడు. అది కూడా పెద్ద మిస్టేక్ అనే చెప్పాలి. సినిమా రిలీజ్ కి ముందే ఇలాంటివి అన్నీ చెక్ చేసుకొని.. కరెక్షన్స్ చేసి ఉంటే.. ఈ సినిమా ఇంకా బాగా వచ్చి ఉండేది. కలెక్షన్లు కూడా దుమ్ము దులేపేవి. ఇప్పటికీ కలెక్షన్లు భారీగానే వసూలు చేస్తుంది. కానీ ఈ మిస్టేక్ వల్ల కాస్త తగ్గినట్టు తెలుస్తోంది.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!