తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ఇవాళ చంచల్ గూడ జైలు నుంచి విడుదల కావడం జరిగింది. హైదరాబాద్ మలక్ పేటలో ఉన్న చంచల్ గూడ జైలు నుంచి విడుదలైన వెంటనే నేరుగా ఇంటికి వెళ్లిపోయారు పల్లవి ప్రశాంత్. డిసెంబర్ 17 బిగ్ బాస్ సీజన్ సెవెన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ అనంతరం అన్నపూర్ణ స్టూడియో బయట జరిగిన దాడుల కేసులో పల్లవి ప్రశాంత్ ని A1 గా చేర్చి పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. దీంతో న్యాయస్థానం 14 రోజులపాటు రిమాండ్ విధించడం తెలిసింది.
Advertisement
ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ తరపున లాయర్లు హైదరాబాద్ నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది.దీంతో పల్లవి ప్రశాంత్ కి 48 గంటల్లో బెయిల్ వచ్చేలా కోర్టులో పేరుగాంచిన లాయర్లు వాదించారు. ఈ విషయంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ భోలే చొరవ తీసుకోవడం జరిగింది. కాగా దాదాపు 15 వేల రూపాయల పూచీకత్తుతో ఈ బెయిల్ ను కోర్టు ఇచ్చింది. రెండు షూరిటీలతో ఈ బెయిల్ లభించింది.
Advertisement
దాడులలో ఆర్టీసీ బస్సులు ధ్వంసం కావడంతో పాటు పోలీస్ వాహనాలు కూడా ధ్వంసం కావడంతో కేసు చాలా సీరియస్ అయింది. ముఖ్యంగా అన్నపూర్ణ స్టూడియో నుండి బయటకు వచ్చిన ప్రశాంత్ నీ పోలీసులు ర్యాలీ చేయకుండా వెళ్ళిపోవాలని సూచించగా, పోలీస్ ఇచ్చిన ఆదేశాలను పాటించకపోవడంతో అరెస్టు కావలసి వచ్చింది. శనివారం సాయంత్రం బెయిల్ రావడంతో జైలు నుండి నేరుగా ప్రశాంత్ ఇంటికి వెళ్లిపోవడం జరిగింది.