Home » కమెడియన్ వేణుమాధవ్ ని ఆ యాంకర్ ప్రేమించిందనే విషయం మీకు తెలుసా ?

కమెడియన్ వేణుమాధవ్ ని ఆ యాంకర్ ప్రేమించిందనే విషయం మీకు తెలుసా ?

by Anji
Ad

దివంగత నటుడు కమెడియన్ వేణుమాధవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయనను ఇప్పటికీ చాలామంది ప్రేక్షకులు అసలు  మర్చిపోలేరు. దిల్, యోగి, లక్ష్మీ వంటి సినిమాల్లో వి.వి.వినాయక్ ఆయనతో చేసిన కామెడీ మామూలుగా ఉండదు.  తన నటనతో  ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. మరీ ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్ అంటే ఎంతో మంది ప్రేక్షకులకు ఇష్టం.అలా ఈయన సినిమాల్లో స్టార్ కమెడియన్ గా ఎంతో పాపులర్ అయ్యారు. అయితే వేణుమాధవ్ ఇండస్ట్రీకి రాకముందు మిమిక్రీ ఆర్టిస్ట్ గా చేసేవారు.అంతేకాకుండా సీనియర్ ఎన్టీఆర్ ఉన్న సమయంలో టిడిపి పార్టీ ఆఫీసులో కూడా పనిచేసేవారు.

Advertisement

అయితే ఈయన మిమిక్రీ చేస్తూ సినిమాల్లో అవకాశాలు అందుకున్నారు. అలా మొదట్లో కొన్ని సినిమాల్లో కామెడీయన్ గా చేసి ఆ తర్వాత హీరోగా కూడా చేశారు. ఇక కమెడియన్ వేణుమాధవ్ హీరో గా.. కమెడియన్ గా..మిమిక్రీ ఆర్టిస్ట్ గా.. మాత్రమే కాకుండా ఒక ప్రముఖ ఛానల్లో ప్రసారం అయ్యే షోకి హోస్టుగా కూడా చేశారు. ఇక ఆ షో ఏంటో కాదు వన్స్ మోర్ ప్లీజ్. ఈ షోలో యాంకర్ ఉదయభానుతో కలిసి వేణుమాధవ్ కూడా హోస్ట్ గా చేశారు. ఇక ఈ షో కి హోస్టుగా చేస్తున్న సమయంలో చాలామంది దర్శకనిర్మాతలు నువ్వు ఇలా యాంకర్ గా చేస్తూ ఉంటే అలాంటి అవకాశాలే వస్తాయి ఫస్ట్ సినిమాల్లో కమెడియన్ గా నిలదొక్కుకో అంటూ కొంతమంది సజెషన్స్ ఇచ్చారట.

దాంతో ఆ డైరెక్టర్ చెప్పిన మాట విని యాంకరింగ్ ని వదిలేసి మళ్లీ సినిమాల్లో ట్రై చేశారు. అయితే వన్స్ మోర్ ప్లీజ్ అనే షో కి హోస్టుగా చేస్తున్న సమయంలో యాంకర్ ఉదయభాను  తో ఈయనకు మంచి సాన్నిహిత్యం ఏర్పడిందట.అయితే అప్పటికే వేణుమాధవ్ కి రెండు పెళ్లిళ్లు జరిగినప్పటికీ ఉదయభానుని మూడో పెళ్లి చేసుకుంటారని ఇండస్ట్రీలో టాక్ వినిపించింది. అయితే ఈ విషయం తన భార్యకు తెలియడంతో ఇంట్లో గొడవలు జరిగి ఉదయభాను తో ఉన్న ఫ్రెండ్ షిప్ కట్ చేసుకున్నారట వేణుమాధవ్.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading