ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాతో టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన సంగతి తెలిసిందే. నితిన్, శ్రీ లీల హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ యాక్షన్ కామెడీ ఫిల్మ్ డిసెంబర్ 8న థియేటర్లలో విడుదలైంది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ ఆర్డినరీ స్టోరీ తో అభిమానులను బాగా నిరాశపరిచింది. విమర్శకుల నుంచి భారీ ఎత్తున నెగటివ్ రివ్యూస్ వచ్చాయి. ఈ మూవీ బడ్జెట్ దాదాపు రూ.45 కోట్లు అయితే బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు రూ.11కోట్లు కూడా దాటలేదు. దీంతో ఈ మూవీలో నటించిన వారందరికీ తీవ్ర నిరాశ ఎదురయింది. ముఖ్యంగా రాజశేఖర్ చాలా డిసప్పాయింట్ అయ్యాడు. ఎందుకంటే క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి కెరీర్ లో ఒక కీలక మలుపు తీసుకొని అతను జగపతిబాబు రాణించాలని భావించాడు.
Advertisement
కానీ అతను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన మొదటి సినిమానే ఎదురు తన్నింది. ఈ మూవీలో ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా రాజశేఖర్ యాక్ట్ చేశాడు. ఈ పాత్ర బాగానే వర్కౌట్ అయింది. రాజశేఖర్ కూడా బాగా నటించాడు. అయితే ఈ మూవీలో ఆ పాత్ర చేసినందుకు ఈ సీనియర్ నటుడు ఏకంగా రెండు కోట్లు రెమ్యునరేషన్ గా పొందాడని వార్తలు వచ్చాయి. ఇది స్మాల్, మిడిల్ రేంజ్ హీరో పారితోషికంతో సమానమని చెప్పుకోవచ్చు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఈ మూవీని ప్రొడ్యూస్ చేసిన సంగతి తెలిసిందే. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనే రాజశేఖర్ కి రెండు కోట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. రాజశేఖర్ తనకిచ్చిన పాత్రకు న్యాయం చేయగలిగాడు. కానీ మూవీ ఓవరాల్ గా ప్లాప్ కావడం వల్ల అది అతనికి ప్లస్ కాలేదు.
లేకుంటే ఈ నటుడు ఫీట్ వేరేలా ఉండేది. భవిష్యత్తులోనైనా ఈ టాలెంటెడ్ నటుడుకి బ్లాక్ బస్టర్ అవగలిగే సినిమాలో ఓ క్యారెక్టర్ దొరకాలని ఆశిద్దాం. ఇక నితిన్ కెరీర్ గ్రాఫ్ సినిమా సినిమాకి దారుణంగా పడిపోతూ వస్తోంది. ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో కామెడీ ఉంది కానీ అది అతిగా ఉండటం వల్ల మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతున్న నేపథ్యంలో అతడు స్క్రిప్ట్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే సినీ కెరీర్ పూర్తిగా బంద్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఎందరో స్టార్ హీరోలు అలానే కనుమరుగయ్యారు.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!