సాధారణంగా బిగ్ బాస్ లో ప్రతీ సీజన్ లో కూడా ఎంటర్ టైన్ మెంట్ చేసేందుకు ఒకరు తప్పక ఉంటారు. అలా బిగ్ బాస్ 7 సీజన్ లో అమర్ దీప్ ఉన్నాడు. బిగ్ బాస్ షో ప్రారంభంలో కాస్త తడబడినప్పటికీ.. ఇక ఆ తరువాత నెమ్మదిగా పుంజుకున్నాడు. అయితే కొన్ని సార్లు తన మాటలతో పాటు ఆటల్లో తెలిసీ, తెలియక చేసిన తప్పుల వల్ల నలుగురిలో నవ్వుల పాలయ్యాడు. అంతేకాదు.. శత్రువులు ఎక్కడో ఉండరు.. మన పక్కనే ఉంటారు అన్నది అమర్ విషయంలో ప్రూవ్ అయింది.
Advertisement
ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో అమర్ ని తన స్నేహితులను సైతం పట్టించుకోలేదు. గురువుగా భావించే శివాజీ అయితే అమర్ ను అనరాని మాటలు అన్నాడు. మెంటల్ టార్చర్ పెట్టాడు. అయినప్పటికీ వీటన్నింటిని చిరునవ్వుతో భరించాడు. అనారోగ్యంతో బాధ పడినప్పటికీ ఏనాడు కూడా బయటికీ చెప్పుకోలేదు. హెల్త్ ప్రాబ్లమ్ వల్ల కొన్ని టాస్క్ లు ఆడలేకపోయినా అది తన వైఫల్యంగానే భావించాడు. కానీ అనారోగ్యాన్ని సాకుగా మాత్రం అస్సలు చెప్పలేదు. విజయానికి కేవలం అడుగు దూరంలో ఆగిపోయిన అమర్ ఈ సీజన్ లో రన్నరప్ గా నిలిచాడు.
Nag:close call👏
Amar last speech👏very mature genuine speech without drama #BiggBossTelugu7 #Amardeep pic.twitter.com/Bv9TV1Uidt— Barathi78 (@Barathi78) December 17, 2023
బిగ్ బాస్ 7 సీజన్ లో అనంతపురం కి చెందిన అమర్ ఎంత సంపాదించాడంటే..? బిగ్ బాస్ షో లోకి రావడానికి ముందే సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు ఉంది. కాబట్టి అమర్ దీప్ కి భారీగానే రెమ్యునరేషన్ ఆఫర్ చేశారు. వారానికి రూ.2.5 లక్షలు ఇచ్చారట. ఈ లెక్కన 15 వారాలకు కలిపి అమర్ దీప్ కి రూ.37,50,000 అందుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో మరో తిరకాస్తు కూడా ఉందండోయ్. ట్యాక్స్ లు, జీఎస్టీల రూపంతో దాదాపు సగానికి పైగా ప్రభుత్వానికి వెళ్తుందట. కేవలం ఇతని ఒక్కని విషయంలో ఇలా కాదు.. అందరి విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. పేరుకే ఇంత రెమ్యునరేషన్ కానీ.. జీఎస్టీ రూపం ద్వారా సగం వరకు ప్రభుత్వానికే వెళ్తుందని సమాచారం.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!