బిగ్ బాస్ సీజన్ 7 ఆట 105 రోజుల పాటు మంచి ఎంటర్టైనింగ్ గా డిచింది. బిగ్ బాస్ టోటల్ కంటెస్టెంట్స్ 19 మంది.. అయితే రతిక రీ ఎంట్రీ వల్ల 20 మంది అయ్యారు. కౌంట్ కు 20 అయినా జనాలు మాత్రం 19 మందే ఉన్నారు. వీరందరూ గ్రాండ్ ఫినాలే ఈవెంట్ కు వచ్చారు. కానీ సీనియర్ యాక్టర్స్ కిరణ్ రాథోడ్, షకీలా మాత్రం ఈ ఈవెంట్ లో కనిపించలేదు. మరి ముందే ఎలిమినేట్ చేసేశారని కోపమో.. రావడానికి వీరికి కుదరలేదో తెలియదు కానీ ఫినాలే కి వీరు మాత్రం హాజరు కాకపోవడం గమనార్హం.
Advertisement
బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే ఈవెంట్ ఆదివారం రాత్రి 7 గంటల నుంచి ప్రారంభమైంది. ఈ ఉల్టా పుల్టా సీజన్ సూపర్ డూపర్ హిట్ కావడంతో.. గ్రాండ్ ఫినాలే ఈవెంట్ కూడా చాలా గ్రాండ్‌గా ఉంటుందని భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయింది. అనుకున్న రేంజ్ లో ఏం సెలబ్రేట్ మాత్రం చేయలేదు. ఈ ఈవెంట్ కి మహేష్ బాబు వస్తాడని చెప్పారు. కానీ మహేష్ బాబు రాలేదు. సుమ, రోషన్, రవితేజ, కళ్యాణ్ రామ్, అల్లరి నరేష్ వంటి సెలబ్రిటీలు హాజరయ్యారు. చివరికీ నాగార్జున సారే పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ ని స్టేజీ పైకి తీసుకొచ్చి.. ప్రశాంత్ చేయిని కూల్ గా లేపేసి విన్నర్ అని చెప్పేశారు.
దీంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక అంతకు ముందు వారాల్లో ఎలిమినేట్ అయిన పూజామూర్తి, దామిని, రతిక, నయని, భోలే, సందీప్, తేజా, శుభశ్రీ, అశ్విని శ్రీ, గౌతమ్, శోభా శెట్టి వాళ్లంతా ఈ గ్రాండ్ ఫినాలే ఈవెంట్లో సందడి చేశారు. కారణాలు ఏమిటో కానీ.. ఈ ఇద్దరు సీనియర్ భామలు మినహా తక్కిన ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ అంతా ఫినాలే ఈవెంట్‌కి హాజరయ్యారు. అగ్రిమెంట్ ప్రకారం.. ఒకసారి బిగ్ బాస్ గడపతొక్కిన తరువాత.. వాళ్లు నిర్వహించే ప్రతి ఈవెంట్‌కి కంటెస్టెంట్స్ హాజరు కావాల్సి ఉంటుంది. పెద్ద ఆరిస్ట్ లు కదా ..ఇలాంటి వాటికి రావడం ఇష్టం లేక రాలేదేమో అంటున్నారు నెటిజన్లు.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!