Home » చలికాలంలో శరీర ఉష్ణోగ్రతను పెంచే ఆహారాలు.. వీటిని తప్పక తినాలి

చలికాలంలో శరీర ఉష్ణోగ్రతను పెంచే ఆహారాలు.. వీటిని తప్పక తినాలి

by Anji
Ad

శరీరంలో రోగనిరోధక శక్తి బలహీన పడుతుంది. జలుబు, దగ్గు, రుమాటిక్ నొప్పి, జ్వరం వంటి సమస్యలు దండెత్తుతాయి. ఈ కాలంలో శరీర రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునే ఆహారాలు తీసుకోవాలి. అందుకు సీజనల్ ఆహారాలతో పాటు నట్స్, విత్తనాలు తినాలి. చలికాలంలో రోజూ 5 నుండి 6 బాదం పప్పులు తినాలి. ఈ గింజ రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. బాదంపప్పులో విటమిన్ ఇ, మెగ్నీషియం, ప్రోటీన్, ఫాస్ఫరస్, మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

Advertisement

రోజూ ఆహారంలో నువ్వులు తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలు పొందుతారు. నువ్వులలో జింక్, కాపర్, కాల్షియం, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు మొదలైన పోషకాలు ఉన్నాయి. అందుకే నువ్వులను శీతాకాలపు సూపర్ ఫుడ్ గా పిలుస్తారు. శీతాకాలంలో అధిక రక్తపోటు సమస్య నివారణకు గుమ్మడికాయ విత్తనాలను తినాలి. గుమ్మడి గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఐరన్, కాపర్, వివిధ విటమిన్లు ఉంటాయి. వీటిని తింటే చలికాలంలో వచ్చే వ్యాధులు నివారించవచ్చు.


చలికాలంలో శరీరం వెచ్చగా ఉండాలంటే వాల్ నట్స్ తినండి. వాల్ నట్స్ లో కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇది మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చలికాలంలో అవిసె గింజలు, చియా గింజలు తినడం మర్చిపోకూడదు. ఈ విత్తనాలు జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో కూడా సహాయపడతాయి.

Advertisement

 తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading