Home » హీరోయిన్ సాయి పల్లవి అద్బుతంగా ఎన్ని భాషలు మాట్లాడుతుందో తెలుసా ?

హీరోయిన్ సాయి పల్లవి అద్బుతంగా ఎన్ని భాషలు మాట్లాడుతుందో తెలుసా ?

by Anji
Ad

సాయి పల్లవి తమిళనాడు లోని ఊటీకి అతి సమీపంలో ఉన్న కొత్త గిరి అనే చిన్న గ్రామంలో పుట్టింది ఈనాటిమని. చిన్నతనం నుంచి డాన్స్ అంటే ఎంతో ఇష్టం. అలాగే చదువుల్లో కూడా ముందంజలో ఉంటుంది. కాబట్టి ఆమెను మెడిసిన్ చదివించారు ఆమె తల్లిదండ్రులు. తల్లి ప్రభావంతో ఆమె నటిగా తన కెరియర్ ను మొదలుపెట్టింది. ఆమెకు పూజ అనే ఒక కవల సోదరి కూడా ఉంది. పుట్టింది కొత్త గిరి గ్రామంలో అయినా అవి మలయాళం ఇండస్ట్రీ నుంచి తొలిసారిగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత తెలుగులో ఫిదా, శ్యామ్ సింగరాయ్ వంటి సినిమాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.

Advertisement

తెలుగుతో పాటు తమిళ్, మలయాళం లో కూడా ఆమె హీరోయిన్ గా రాణిస్తుంది. ఈ మధ్యకాలంలో కాస్త గ్యాప్ తీసుకొని ఫ్యాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయడానికి సమాయత్తం అవుతుంది. 2022 వ సంవత్సరం వరకు చాలా బిజీగా సినిమాలో నటించిన సాయి పల్లవి గార్గి చిత్రం తర్వాత ఒక్క సినిమాలో కూడా కనిపించలేదు. దాదాపు పూర్తి ఏడాది గ్యాప్ తీసుకొని ఇప్పుడు కొన్ని అద్భుతమైన ప్రాజెక్ట్స్ తో మరోసారి ప్రేక్షకులను కనువిందు చేయనుంది. అయితే ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే సాయి పల్లవి ఎన్ని భాషలు మాట్లాడగలదు అని. ఆమెకు వచ్చిన భాషల లిస్టు తెలిస్తే అందరూ నోరెళ్ల పెట్టాల్సిందే. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్, జార్జియాన్ తో పాటు ఆమె మాతృ భాష బడుగ చాలా చక్కగా మాట్లాడుతుంది.

Sai Pallavi gets more remuneration than heroes

Sai Pallavi gets more remuneration than heroes

ఈ సినిమా ఇండస్ట్రీలో ఉంటే ఆ భాష నేర్చుకోవడం చాలా మంది హీరోయిన్స్ చేస్తుంటారు. కానీ ఒకటి లేదా రెండు భాషలు నేర్చుకోవడం వరకు ఒకే. సాయి పల్లవి మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధం. ఆమె ఏ భాషలో నటిస్తే ఆ భాష పూర్తిగా పట్టు వచ్చాకే నటిస్తుంది. అలాగే తన డబ్బింగ్ కూడా చెప్పుకుంటుంది. సాయి పల్లవి దాదాపు ఏడు పైగా భాషలు మాట్లాడుతూ అతి తక్కువ మంది హీరోయిన్స్ మాత్రమే సాధించిన ఈ ఫీట్ ని సాధించింది.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading