ఏపీ ప్రభుత్వం చింతామణి నాటకం పై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని కొంతమంది ప్రశంసిస్తూ ఉండగా మరికొంతమంది మాత్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై విమర్శలు కురిపిస్తున్నారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జబర్దస్త్ నటుడు అప్పారావు అసంతృప్తి వ్యక్తం చేశారు. చింతామణి నాటకం పై ఏపీ ప్రభుత్వం నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అప్పారావు డిమాండ్ చేశారు.
Also Read: పవన్ సినిమా లీక్ .. హైప్ క్రియేట్..!
Advertisement
విశాఖపట్నంలో చింతామణి నాటకం పై నిషేధం విధించడంతో పలువురు కళాకారులు, తెలుగు భాషా ప్రేమికులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మద్దిలపాలెం లో జంక్షన్ వద్ద తెలుగుతల్లి విగ్రహం వద్ద తెలుగు దండు కూడా నిరసన కార్యక్రమాలను చేపట్టింది. ఈ సందర్భంగా జబర్దస్త్ కామెడియన్ అప్పారావు మీడియాతో మాట్లాడుతూ… 1920లో మహాకవి కాళ్లకూరి నారాయణరావు చింతామణి నాటకం రాశారని తెలిపారు. మొదటిసారి చింతామణి నాటకంలో కాళ్ళకూరి నారాయణరావు కూడా నటించారని చెప్పారు. వైసిపి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చాలా బాధాకరమని అసంతృప్తి వ్యక్తం చేశారు.
Advertisement
వైసిపి ప్రభుత్వం సంఘీభావం తో కూడిన సమావేశాన్ని ఏర్పాటు చేసి తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కళాకారులను కళలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా గతంలో అప్పారావు నాటకాలు వేసేవారు. నాటకాలతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న అప్పారావు జబర్దస్త్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తన స్కిట్స్ తో అప్పారావు ప్రేక్షకులను నవ్వించి సినిమా అవకాశాలు సైతం దక్కించుకున్నారు. ప్రస్తుతం టీవీ కార్యక్రమాలతో పాటూ సినిమాలు కూడా చేస్తున్నారు.
Also Read: ఆ సినిమా కోసం బాలకృష్ణకు 3 కండీషన్స్ పెట్టిన NTR !