Home » ఆర్తి అగర్వాల్ చివరి రోజుల్లో ఏం జరిగిందో తెలుసా ?

ఆర్తి అగర్వాల్ చివరి రోజుల్లో ఏం జరిగిందో తెలుసా ?

by Anji
Ad

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్లలో ఆర్తి అగర్వాల్ కూడా ఒకరు.. దాదాపు ఎంతో మంది హీరోలతో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈమె చిన్న వయసులోనే కన్నుమూయడంతో అభిమానులు సైతం ఈ విషయాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతూ ఉంటారు. ఆర్తి అగర్వాల్ర్ కెరీర్ లో ఎన్నో ఎఫైర్లకు సంబంధించిన రూమర్లతో తెగ వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా ఆర్తి అగర్వాల్ చివరి రోజుల్లో తనతో మాట్లాడిన మాటలను డైరెక్టర్ , నటుడు అమ్మ రాజశేఖర్ మీడియాతో ముచ్చటించారు  వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

ఆర్తి అగర్వాల్ సినీ ఇండస్ట్రీలోకి 16వ ఏటనే పాగల్ అనే ఒక బాలీవుడ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.. ఆ తర్వాత తెలుగులో వెంకటేష్ కు జోడిగా నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో ఎంట్రీ ఇవ్వగా తన మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. ఆ వెంటనే బాలయ్య, చిరంజీవి, నాగార్జున, ప్రభాస్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ తదితర హీరోలతో నటించి మంచి క్రేజ్ ను అందుకుంది. అలా ఆర్తి అగర్వాల్ కెరియర్ పీక్స్ లో వుండగానే.. వున్నట్టుండి 2006 నుంచి కొన్ని కారణాల చేత ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. 2007లో ఒక సాఫ్ట్వేర్ ను వివాహం చేసుకొని 2009లో విడాకులు తీసుకోవడం జరిగింది.. 2015లో అధిక బరువు ఉన్న కారణంగా లైపో సెక్షన్ అనే సర్జరీ చేయించుకున్న ఈమె ఆరు వారాల తర్వాత శ్వాసకోశ సంబంధ సమస్యలతో మరణించినట్లు వార్తలు వినిపించాయి.

ఈమె మరణించే సమయానికి ఈమె వయసు కేవలం 31 సంవత్సరాలు. తాజాగా ఆర్తి అగర్వాల్ చివరి రోజుల్లో తనతో మాట్లాడిన మాటలను డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ మీడియాతో తెలియజేశారు. 2015లో అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించిన రణం-2 సినిమాలో ఆర్తి అగర్వాల్ ని హీరోయిన్ గా తీసుకున్నారట.. ఆ సమయంలో నటుడు శ్రీహరికి కూడా అనారోగ్య సమస్యలతో ఈ సినిమా షూటింగ్ వాయిదా వేశారు. ఆ సమయంలో ఆరు నెలల గ్యాప్ తీసుకొని సినిమా షూటింగ్ కి వచ్చిన ఆర్తి అగర్వాల్ ని చూసి షాక్ అయిపోయానని తెలిపారు అమ్మ రాజశేఖర్.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading