సాధారణంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కొంత మంది హీరోలు ఈ ఏడాది ఓ ఇంటి వారు అవుతున్నారు. ఇప్పటికే మెగా కంపౌండ్ నుంచి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాఠితో ఏడు అడుగులు వేశాడు. ఈ లిస్ట్ లోకి ఇప్పుడు మరో కుర్ర హీరో కూడా చేరుతున్నాడు. అతను మరెవ్వరో కాదండోయ్.. దగ్గుబాటి వారసుడు దగ్గుబాటి అభిరామ్. టాలీవుడ్ అగ్ర నిర్మాత దగ్గుబాటి సురేష్ చిన్న కుమారుడు అభిరామ్. రానాకి తమ్ముడు. ఈ ఏడాది తేజ దర్శకత్వంలో వచ్చిన అహింస సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.
Advertisement
అయితే ఈ చిత్రం అనుకున్న విజయం సాధించకపోవడంతో పెద్దగా పేరు రాలేదు. అభిరామ్ కి హీరోగా నిలబడాలి అంటే చాలా సమయం పడుతుందనే చెప్పవచ్చు. ఇదిలా ఉంటే.. గత కొంత కాలం నుంచి అభిరామ్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా వస్తున్న వార్త ప్రకారం.. అభిరామ్ కి ఓ వ్యాపార వేత్త కుమార్తె అయినటువంటి ప్రత్యూష చపరాతో డిసెంబర్ 04న శ్రీలంకలో పెళ్లి జరుగుతుందని తెలుస్తోంది.
మరికొద్ది సేపట్లోనే శ్రీలంకలోని ఫైవ్ స్టార్ రిసార్ట్ అనంతర కలుతారాలో వీరి వివాహం చాలా గ్రాండ్ గా జరుగనుందని సమాచారం. ఇప్పటివరకు అభిరామ్ పెళ్లి గురించి దగ్గుబాటి ఫ్యామిలీ బయటపెట్టలేదు. ఎక్కడ సమాచారం కూడా తెలపలేదు. ఇప్పటికే దగ్గుబాటి ఫ్యామిలీ మొత్తం కూడా లంకకు బయలుదేరినట్టు సమాచారం. ఈ పెళ్లి 5 రోజుల పాటు జరుగుతుందని సమాచారం. ఈ పెళ్లికి కేవలం 200 మంది అతిథులు మాత్రమే హాజరుకానున్నట్టు తెలుస్తోంది. పెళ్లి తరువాత హైదరాబాద్ తిరిగి వచ్చి గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పెళ్లి ఇంత సీక్రెట్ గా చేయడం వెనుక కారణం ఏంటీ అనేది మాత్రం అంతుచిక్కడం లేదు.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!