నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా అఖండ. ఈ సినిమాకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ బాలయ్యకు జోడీగా నటించింది. ఇప్పటికీ ఈ సినిమా థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా 200 కోట్ల క్లబ్ లో చేరింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లోనూ ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబట్టింది.
Advertisement
ఈ సినిమాలో బాలయ్య తో నటించిన చిన్నారి పాత్రకు కూడా ఎంతో గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో ఈ పాప ఎవరు అని వెతకడం ప్రారంభించారు. అయితే బాలయ్యతో నటించిన చిన్నారి పేరు బేబీ దేష్ట. ఈ పాప తల్లితండ్రులు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సినిమాలో నటించేందుకు తమ పాపకు ఇన్స్టాగ్రామ్ ద్వారా అవకాశం వచ్చిందని చెప్పారు.
Advertisement
మొదటగా నిర్మాతలు ఇన్ స్టాగ్రామ్ లో తమ పాప వీడియోలు చూసి ఆ తర్వాత బోయపాటి శ్రీను కు చెప్పానని అన్నారు. అలా ఆడిషన్స్ కి వెళ్ళామని పాపను సినిమాల్లోకి తీసుకున్నారని తెలిపారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో బాలయ్య చిన్నారికి చాలా క్లోజ్ అయ్యారని చెప్పారు.
తమ పాప తో పాటు తమను కూడా ఎంతో బాగా చూసుకున్నారని అన్నారు. తమ కూతురు బాలయ్య సినిమాలో నటించడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. మొదటి సినిమాకే పాపకు కు ప్రశంసలు రావడం ఆనందంగా ఉందన్నారు. చిన్నారి వయసు చాలా తక్కువ అయినప్పటికీ బోయపాటి శ్రీను పాపతో చాలా బాగా యాక్టింగ్ చేయించారని చెప్పారు. ఈ సినిమాలో ఛాన్స్ ఇచ్చినందుకు బోయపాటి శ్రీను కు కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు.
Also Read:: అద్దె గర్భం ద్వారా పిల్లలను కన్న సెలబ్రెటీలు వీళ్లే..!