Home » విడాకులు తీసుకున్న బిచ్చగాడు 2 నటి.. కారణం అదేనా ?

విడాకులు తీసుకున్న బిచ్చగాడు 2 నటి.. కారణం అదేనా ?

by Anji
Ad

 సాధారణంగా ఈ మధ్య కాలంలో సినీ సెలెబ్రిటీలు ఎప్పుడు ఏ విషయాన్ని ఏ విధంగా చెబుతారో తెలియక అభిమానులు సైతం తికమక పడుతున్నారు. కొంతమంది ప్రేమ, పెళ్లి అంటూ శుభవార్తలు చెబుతుంటే.. మరి కొందరూ విడాకులు అంటూ అభిమానులకు పూర్తిస్థాయిలో నిరాశ మిగులుస్తున్నారు. ఈ తరుణంలోనే తాజాగా మరొక హీరోయిన్ విడాకులు తీసుకొని అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ఆమె ఎవరో కాదు బిచ్చగాడు 2 సినిమాలో సిస్టర్ గా నటించిన షీలా రాజ్ కుమార్. కోలీవుడ్ లో చాలా సినిమాలు చేసి ప్రేక్షకులను నేర్పించిన షీలా తాజాగా సోషల్ మీడియా ద్వారా తన భర్తతో విరాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించింది.


కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఈమె తెలుగు సినిమా ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. కానీ కోలీవుడ్ లో మాత్రం చాలా సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ద్రౌపది, మండేలా, టూ లెట్ వంటి సినిమాలలో నటించిన ఈమె రీసెంట్ గా వచ్చిన లారెన్స్, ఎస్.జె.సూర్య నటించిన జిగర్తాండ డబుల్ ఎక్స్ లో కూడా నటించింది. అంతేకాదు విజయ్ ఆంటోనీ నటించిన బిచ్చగాడు 2 సినిమాలో కూడా విజయ్ కి సిస్టర్ పాత్రలో నటించింది. ఇక షీలా నటించిన టూ లెట్ సినిమాతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న ఈమె ఈ సినిమాకు గాను నేషనల్ అవార్డు కూడా లభించింది.

Advertisement


మరోవైపు తమిళ, మలయాళ భాషల్లో ఎన్నో అవకాశాలు అందుకున్న షీలా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలలో మాత్రమే నటిస్తూ.. ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఇక ఈమె యాక్టింగ్ స్కూల్ నడిపిస్తున్న చోళన్ ను వివాహం చేసుకుంది. ఇకపోతే వివాహం తర్వాత ఎంతో సంతోషంగా గడిపిన ఈమె అనుకోకుండా ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెడుతున్నట్టు తాజాగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఇకపోతే సోషల్ మీడియా ద్వారా తానూ చోళన్ విడిపోతున్నట్టు ప్రకటించి, చివరిలో థాంక్యూ చోళన్ అంటూ రాసుకొచ్చింది. అయితే ఎందుకు తన భర్తతో విడిపోతుందో అనే విషయాన్ని మాత్రం తెలపలేదు. కేవలం కారణాలు చెప్పకుండా విడిపోతున్నట్టు మాత్రం ప్రకటించింది షీలా. ఇక ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading