ప్రముఖ వెండితెర నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించిన ఈమె కరోనా సమయంలో ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన ఫాలోవర్స్ ను పెంచుకుంది.. ముఖ్యంగా ఫిట్నెస్ విషయంలో జిమ్ము వర్కౌట్స్ చేస్తూ ఎప్పుడు బిజీగా ఉండే ప్రగతి తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు మరింత దగ్గర అయిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఒక వైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు సీరియల్స్ లోకి కూడా అడుగుపెట్టిన ఈమె తాజాగా సరికొత్త సీరియల్ తో ప్రేక్షకులను అలరిస్తోంది.
Advertisement
డియాలో కూడా నిత్యం యాక్టివ్ గా ఉండే ప్రగతి అప్పుడప్పుడు తనపై వచ్చే నెగటివ్ కామెంట్స్ కి తనదైన శైలిలో బుద్ధి చెబుతూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రగతి తన కెరియర్ లో జరిగిన విషయాల గురించి వెల్లడించింది. ఈ సందర్భంగా ప్రగతి మాట్లాడుతూ.. మాది హైదరాబాద్ పదో తరగతి వరకు నేను ఇక్కడే చదువుకున్నాను. ఆ తర్వాత చెన్నైకి షిఫ్ట్ అయ్యాము. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోతే అమ్మ నన్ను పెంచి పోషించింది. అయితే ఆ సమయంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాము.. అమ్మకు ఆర్థికంగా సహాయం చేయడానికి కొంతకాలం కాలేజీ చదువుకునేటప్పుడు కార్టూన్ పాత్రలకు డబ్బింగ్ కూడా చెప్పాను.
Advertisement
ఇక తర్వాత చెన్నైలోని మైసూర్ సిల్క్ ప్యాలెస్ షో రూమ్ లో మోడల్ గా పనిచేశాను. అప్పుడు తెలిసిన వారి ద్వారా నా ఫోటోలు ప్రముఖ దర్శకుడు భాగ్య రాజా వద్దకు వెళ్తే ఆడిషన్స్ అనంతరం ఆయన తన సినిమాలో నన్ను సెలెక్ట్ చేశారు. అలా క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్ర కోసం నన్ను ఎంచుకున్నారు.. మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయమని చెప్పారు ఓకే అన్నాను. కానీ తీరా చూస్తే ఆ సినిమాలో హీరోయిన్గా నన్ను తీసుకున్నారు. ఇక ఆయన మాటకు నేను షాక్ అయ్యాను. మా అమ్మ ధైర్యం చెప్పడంతో హీరోయిన్గా తెరంగేట్రం చేశాను. ఇక భాగ్య రాజా గారు తెరకెక్కించిన వీట్టులే విశేషం అదే నా తొలి చిత్రం.. అదే చిత్రాన్ని గౌరమ్మ నీ మొగుడెవరమ్మా అనే పేరుతో తెలుగులో విడుదలయ్యింది. ఇక హీరోయిన్గా ఎనిమిది సినిమాలలో నటించాను. ఇక అలా ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చాను అంటూ తెలిపింది ప్రగతి.