Home » ఈ ఏడాది కార్తీక పూర్ణిమ శుభ సమయం ఎప్పుడు ? స్నానం ప్రత్యేకత ఏంటంటే ?

ఈ ఏడాది కార్తీక పూర్ణిమ శుభ సమయం ఎప్పుడు ? స్నానం ప్రత్యేకత ఏంటంటే ?

by Anji
Published: Last Updated on
Ad

సాధారణంగా  హిందూ క్యాలెండర్ ప్రకారం.. నెలకు ఒక పౌర్ణమి, ఒక అమావాస్య వస్తుంది. ప్రతి నెలలో ఒక పౌర్ణమి వస్తుంది కాబట్టి ఏడాదికి 12 పౌర్ణమిలు లేదా 13పౌర్ణమిలు వస్తాయి.  సనాతన ధర్మంలో నెలలో వచ్చే ప్రతి పౌర్ణమి చాలా ముఖ్యమైంది. ఒక్కొక్క పౌర్ణమికి ఒక్కొక్క పేరు ఉంటుంది. అయినప్పటికీ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి హిందువులకు మరీ ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే కార్తీక మాసం శివకేశవులను పూజించడానికి ఉత్తమమైన మాసంగా పరిగణించబడుతుంది.

Advertisement

ఈ రోజున నదిలో చేసే స్నానం, దీపారాధన, దానం అత్యంత విశిష్టమని, యాగం చేసిన ఫలితం లభిస్తుందని విశ్వాసం. ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి 27 నవంబర్ 2023 సోమవారం నాడు వచ్చింది.  కార్తీక పౌర్ణమి రోజున ధార్మిక కార్యక్రమాలు చేయడం వల్ల విశేష పుణ్యఫలం లభిస్తుందని, దాన, ధర్మాలు చేయడం వల్ల సిరిసంపదలు పెరుగుతాయని..అలాగే అన్నింటిలో కూడా అదృష్టం కలిగిస్తుందని విశ్వాసం. కార్తీక పౌర్ణమి  రోజు శుభ సమయం, ఉపవాసం, పూజా విధానాన్ని తెలుసుకుందాం.

Advertisement

పురాణాల ప్రకారం.. కార్తికేయుడు, తారకాసురుడు అనే రాక్షసుడుని సంహరించాడు. అనంతరం తారకాసురుడు ముగ్గురు కుమారులు తారకాక్షుడు, కమలాక్షుడు విద్యున్మాలిలను త్రిపురాసురులు అని పిలుస్తారు. వీరు బ్రహ్మ దేవుడు కోసం తపస్సు చేసి ఒక నగరం నిర్మించి ఇవ్వమని వరం కోరారు. అంతరిక్షంలో తిరుగుతూ వెయ్యి సంవత్సరాలకొకసారి కలుసుకుంటూ ఉండేటట్లు.. అలా కలుసుకున్న సమయంలో ఒకే బాణంతో ఎవరు మూడింటిని ధ్వంసం చేయగలరో వారివల్ల మాత్రమే మరణం కలిగేటట్లు వరం పొందారు. ఈ వరం పొందిన తరువాత త్రిపురాసురులు మూడు లోకాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కార్తీక పౌర్ణమి రోజున శివుడు ఒకే బాణంతో ముగ్గురు రాక్షసులను సంహరించాడు. ఆ తర్వాత శివుడుని త్రిపురగా పిలవడం ప్రారంభించారు. కార్తీక పూర్ణిమ రోజున త్రిపురాసురులను సంహరించాడు. కాబట్టి కార్తీక పౌర్ణమిని  త్రిపుర పూర్ణిమ అని కూడా పిలుస్తారు.  ఈ రోజున దేవ్ దీపావళిని కూడా జరుపుకోవడం విశేషం.

మరిన్ని టాలీవుడ్ న్యూస్  కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading