Home » ఏడేళ్ల తరువాత ఆ టాలీవుడ్ జంట విడాకులకు సిద్ధం..?

ఏడేళ్ల తరువాత ఆ టాలీవుడ్ జంట విడాకులకు సిద్ధం..?

by Anji
Ad

సాధారణంగా చిత్ర పరిశ్రమలో విడాకుల న్యూస్ ల గురించి ఎక్కువగానే వింటుంటాం. కొంతమంది ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. రెండు, మూడేళ్లు బాగానే కలిసి ఉంటారు. సోషల్ మీడియాలో ఫొటోలు కూడా ఎక్కువగానే షేర్ చేస్తుంటారు. కానీ ఆ తరువాత ఏమి అవుతుందో తెలియదు. మనస్పార్థాలు అంటూ విడాకులు తీసుకుంటారు.

Advertisement

ఈ లిస్ట్ చెప్పుకోవాలంటే.. చాలా ఉంటుంది. అయితే ఇప్పుడు మరో టాలీవుడ్ కపుల్ విడాకులు తీసుకునేందుకు సిద్ధం అయింది. పెళ్లి జరిగి వారికి ఏడేళ్ల తరువాత ఈ జంట విడాకులకు సిద్ధమవ్వడం విశేషం.

 

వివరాల్లోకి వెళ్లితే.. అతను టాలీవుడ్ హీరో. ఇతని కెరీర్ ప్రారంభంలోనే రెండు, మూడు హిట్ సినిమాలు పడ్డాయి. దీంతో అతనికి వరుస ఆఫర్స్ వచ్చాయి.  ఇక ఆ తరువాత సరైన స్క్రిప్టులు ఎంచుకోవడంలో ఇతను విఫలం చెందాడనే చెప్పవచ్చు. తనకు జోడీగా ఓ సినిమాలో నటించిన హీరోయిన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి కులాలు వేరు కావడంతో ఈ హీరో తండ్రి తొలుత ఒప్పుకోలేదట. ఇక ఆ తరువాత ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. ఇక ఆ తరువాత ఇతనికి హీరోగా ఛాన్స్ లు రాలేదు. సెకండ్ హీరోగా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించాడు. అయినా అతనికి కలిసిరాలేదు. ఇక ఆ తరువాత తన భార్యతో కలిసి పలు టీవీ షోల్లో పాల్గొన్నాడు. అక్కడ వీరికి మంచి ఆదరణ లభించింది. 

Advertisement

ఈ తరుణంలో మరోసారి ఇతనికి హీరో ఛాన్స్ లభించింది.   కానీ ఆ సినిమా సక్సెస్ కాలేదు. దీంతో తన భార్యతో గొడవలు మొదలయ్యాయి. ఇద్దరూ సెపరెట్ గా ఉండటం మొదలుపెట్టారు. మరోపక్క హీరో.. తన లేటెస్ట్ మూవీలో నటించి హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నాడు. ఈ విషయం తన భార్యకి తెలిసింది. దీంతో వీరి మధ్య మరింత దూరం పెరిగింది. వీళ్లు కలిసే అవకాశం అయితే కనిపించడం లేదు. ఆ హీరో విడాకుల కోసం అప్లై చేద్దామంటే.. తన భార్య భరణం కోట్లలో డిమాండ్ చేస్తుందట. అసలు సినిమాలు లేవు.. ఆమెకు కోట్లలో భరణం ఎలా ఇవ్వాలా అని అతను కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి మరీ. 

మరిన్ని టాలీవుడ్ న్యూస్  కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading