సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి ఏపీ హైకోర్టు సాధారణ బెయిల్ ని మంజూరు చేయడం జరిగింది. దీంతో తెలుగుదేశం శ్రేణులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈనెల 28 దాకా మధ్యంతర బెయిల్లో ఉన్న షరతులు వర్తిస్తాయి. 29 తర్వాత రాజకీయపరమైన సభలు, సమావేశాల్లో చంద్రబాబు నాయుడు పాల్గొనవచ్చు అని హైకోర్టు అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ కేసు విచారణ మొదలైన 22 నెలల వరకు చంద్రబాబు బయటే ఉన్నారని ఆ టైంలో సాక్ష్యులను ప్రభావితం చేశారు అనడానికి ఆధారాలు లేనట్లు హైకోర్టు చెప్పింది. అంతేకాకుండా అత్యున్నత భద్రత మధ్యనున్న చంద్రబాబు కేసు విచారణ నుండి తప్పించుకునే అవకాశం లేదు అని కూడా హైకోర్టు చెప్పింది.
Advertisement
Advertisement
సిమ్మన్స్ టెక్ డైరెక్టర్ మరియు డిజైన్ టెక్ యజమాని వాట్సాప్ చాట్లకి చంద్రబాబుకి సంబంధం కూడా లేదని హైకోర్టు చెప్పేసింది. హైకోర్టు తీర్పుని ఇలా ఇవ్వడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఎలెక్షన్స్ దగ్గరికి వచ్చిన ఈ ప్రస్తుత తరుణంలో ఆరు నెలల కాలం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలకు చాలా ముఖ్యమైన సమయం.
కీలక సమయంలో చంద్రబాబు జైల్లోనే ఉంటే పార్టీ నిర్వహణ చాలా కష్టమై ఉండేది ఇప్పుడు బెయిల్ ఆ పార్టీకి ఆక్సిజన్ వంటిది సరైన టైమ్ కి బాబు విడుదలవ్వడంతో పూర్తిస్థాయిలో రాజకీయ వ్యవహారాలను నడిపిస్తారని చక్కటి నిర్ణయాలు వేగంతో తీసుకుంటారని తెలుస్తోంది. ఇంత పెద్ద ఎదురు దెబ్బ తగిలిన తర్వాత ఈ సమయాన్ని రెట్టింపు పట్టుదలతో చంద్రబాబు ఉపయోగించుకునే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!