ఒకప్పుడు హీరోగా ఇండస్ట్రీకి పరిచయమై ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా మొన్నటి వరకు స్టార్ హీరోయిన్లకు తండ్రిగా, మామ గా నటించి ప్రేక్షకులలో చెరగని ముద్ర వేసుకున్న నటుడు చంద్రమోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాలలో నటించి అంతకుమించి పేరు దక్కించుకున్న ఇటీవల అనారోగ్య సంబంధిత సమస్యలతో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఈ తరుణంలోనే ఆయనకు సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా బయటకి వస్తూ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇదివరకే కే.విశ్వనాథ్, చంద్రమోహన్ మధ్య ఉన్న బంధుత్వం గురించి తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఇప్పుడు గాన గాంధర్వుడు సంగీత దర్శకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కి చంద్రమోహన్ కి మధ్య కూడా బంధుత్వం ఉందట. అది ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
సంగీత దిగ్గజం ఎస్పీ బాల సుబ్రమణ్యంతో అటు చంద్రమోహన్ కు ఇటు కే విశ్వనాధ్ కి కూడా మంచి బంధుత్వం ఉంది. ఇక ఆ బంధుత్వం ఎలాంటిది అంటే చంద్రమోహన్ బావమరిది చెల్లిని ఎస్పీ బాలసుబ్రమణ్యం అన్నయ్య వివాహం చేసుకున్నారు. అలా వీరిద్దరి మధ్య అన్నదమ్ముల అనుబంధంగా ఏర్పడింది. ఇక మరో వైపు చంద్రమోహన్ కి, కే.విశ్వనాథ్ తో బంధుత్వం ఎలా ఏర్పడింది అనే విషయానికి వస్తే.. తన పెదనాన్న కుమారుడే కే విశ్వనాధ్ అని చంద్రమోహన్ కే.విశ్వనాథ్ చనిపోయినప్పుడు ఆయన పార్ధీవ దేహం వద్ద బోరున విలపిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. తన పెదనాన్న రెండవ భార్య కొడుకు కే విశ్వనాథ్ చంద్రమోహన్ తల్లి, కే విశ్వనాథ్ తండ్రి మొదటి భార్య అక్కచెల్లెలు కావడం వల్ల వీరిద్దరి మధ్య అన్నదమ్ముల అనుబంధం ఏర్పడింది.
Advertisement
ఇకపోతే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో సీతామహాలక్ష్మి, సీత కథ, సిరిసిరిమువ్వ, శంకరాభరణం వంటి చిత్రాలు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇకపోతే గతంలో కూడా విశ్వనాథ్ గురించి చంద్రమోహన్ మాట్లాడుతూ.. సినిమా బంధం కంటే మా ఇద్దరి మధ్య కుటుంబ బంధమే ఎక్కువగా ఉంది. మద్రాస్ లో ఉన్నప్పుడు ఒకే చోట స్థలం కొని.. పక్కపక్కనే ఇల్లు నిర్మించుకొని 25 సంవత్సరాలు ఉన్నాము అంటూ చంద్రమోహన్ వెల్లడించారు. ఇక అలా వీరు ముగ్గురు చంద్రమోహన్ కే విశ్వనాథ్ ఎస్పీ బాలసుబ్రమణ్యం కూడా అన్నదమ్ములు కావడం విశేషం. అంతేకాదు వీరి ముగ్గురు కాంబినేషన్ లో వచ్చిన శంకరాభరణం సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
మరిన్ని టాలీవుడ్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!