సినీ పరిశ్రమలో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు అనారోగ్యాల కారణంగా ఎంతో మంది అగ్రతారలు మృత్యువాతపడ్డారు. తాజాగా ప్రముఖ సింగర్, బ్యాట్ అవుట్ ఆఫ్ హెల్త్ ఆల్బమ్‌తో ప్రపంచఖ్యాతి సంపాదించిన యూఎస్ రాక్ స్టార్, నటుడు మీట్ లోఫ్ తుదిశ్వాస విడిచారు. మైఖేల్ లీ అని పిలువబడే ఈ అమెరికన్ గాయకుడు సుమారు ఆరు దశాబ్దాలుగా నటుడిగా కొనసాగుతూ ఉన్నాడు. ఇక ఆ తరువాత సింగర్‌గా కూడా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా 100 మిలియన్లకు పైగా ఆల్బమ్స్ అతడు విక్రయించినట్టు తెలుస్తున్నది.
Advertisement
Advertisement
మీట్లోప్ మరణాన్ని అతని అధికారిక పేస్బుక్ పేజీలో ప్రకటించారు. ఇక సింగర్ మీట్ లోప్ భార్య సమయంలో అతని పక్కనే ఉందని.. చివరి 24 గంటలు అతని స్నేహితులతో ఉన్నారని ప్రకటన పేర్కొన్నది. అతని కుటుంబ సభ్యులు వెంటనే మరణానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. 1970లో మీట్‌లోఫ్ తన పాటలతో స్టేజీ పర్పామెన్స్ ఇస్తూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. 1977లో బ్యాట్ అవుట్ ఆఫ్ హెల్ ఆల్బమ్.. అదేవిధంగా ఫ్యారడైజ్ బై ది డాస్ బోర్డ్ లైట్, ఐయామ్ గొన్నా లవ్ హర్ ఫర్ అస్ బాత్ అస్ వంటి హిట్ పాటలతో ప్రసిద్ధి చెందారు.
బ్యాట్ అవుట్ ఆఫ్ హెల్ దాదాపు 43 మిలియన్ కాపీలు అమ్ముడుపోయాయి. అత్యధికంగా అమ్ముడు పోయిన ఆల్బమ్స్‌లో ఈ ఆల్బమ్ కూడా ఒకటి. ఇక సింగర్ గానే కాకుండా.. నటుడిగా మీట్ ఆఫ్ లోప్ సుమారు 65 సినిమాల్లో నటించాడు. అతని ఆల్బమ్స్‌ను పక్కన పెడితే చలన చిత్రాలు, టీవీ షోలో నటించి నటుడిగానూ ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆయన నటించిన సినిమాలో రాఖీ హర్రర్ పిక్చర్ షో ప్లైట్ క్లబ్ వంటి సినిమాలు ఆయనకు నటుడిగా మంచి పేరును తీసుకొచ్చాయి.