టాలీవుడ్ సీనియర్ హీరో మాస్ మహారాజా నటించిన రీసెంట్ మూవీ టైగర్ నాగేశ్వర రావు రిలీజ్ అయి పాజిటివ్ టాక్ ను అందుకున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కావడం.. అంచనాలు భారీగా ఉండడంతో కమర్షియల్ గా విజయం సాధించలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద మోస్తరు వసూళ్లతో సరిపెట్టుకుంది. అయితే రవితేజ మార్క్ వినోదం, మాస్ ఎలిమెంట్స్, యాక్షన్ సీక్వెన్స్ అభిమానులను బాగా అలరించాయి.
ఇక థియేటర్లలో అలరించిన టైగర్ నాగేశ్వర రావు ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేశాడు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఈరోజు అర్ధరాత్రి నుంచే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో టైగర్ నాగేశ్వర రావు స్ట్రీమింగ్ అవుతోంది. కాగా మొదట నవంబర్ 27న రవితేజ ఓటీటీలోకి వస్తుందని వార్తలు వచ్చాయి. అయితే వారం రోజుల ముందుగానే ఈ పాన్ ఇండియా మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇక్కడ ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి.
Advertisement
Advertisement
ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా టైగర్ నాగేశ్వరరావు ను నిర్మించారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ మరో కీలక పాత్రలో మెరిశారు. జిషు సేన్ గుప్తా, మురళీ శర్మ, హరీష్ పేరడీ, నాజర్, ఆడుకాలం నరేన్, ప్రదీప్ రావత్ తదితరులు వివిధ పాత్రల్లో నటించారు. ఈ సినిమాను ఇంట్లోనే అందరు చూసేయొచ్చు. ఇక రవితేజ సినిమాల విషయానికొస్తే రెండు, మూడు ప్రాజెక్టులను లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాయి.
మరిన్ని టాలీవుడ్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!