Ad
ఇండియా, పాకిస్తాన్ లో క్రికెట్ కు పిచ్చ క్రేజ్ ఉంటుంది. అందుకే ఇక్కడ IPL అక్కడ PSL ను స్టార్ట్ చేశారు. కానీ ఆటగాళ్లకు ఇచ్చే రెమ్యునరేషన్ పాకిస్తాన్ తో పోల్చితే ఇండియాలో భారీ మొత్తంలో ఉంటుంది. బీసీసీఐ 4 విభాగాల్లో ఆటగాళ్లకు (A+, A, B, C ) వేతనాలను చెల్లిస్తుంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ ప్లేయర్లను 3 కేటగిరీలుగా ( A, B, C ) విభజించింది.
గ్రేడ్ A+ :
Advertisement
- BCCI: ఏడాదికి రూ.7 కోట్లు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, బుమ్రాలు ఈ కేటగిరీలో ఉన్నారు.
- PCB: ఈ కేటగిరీ లేదు
గ్రేడ్ A:
- BCCI: ఏడాదికి రూ.5 కోట్లు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, చటేశ్వర్ పుజారా, ఆజింక్యా రహానే, కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, మహమ్మద్ షమీ, ఇశాంత్ శర్మ, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్‌లు ఈ కేటగిరీలో ఉన్నారు.
- PCB: ఏడాదికి రూ.61 లక్షలు. బాబర్ అజం, అజర్ అలీ, షాహీన్ షాలు ఈ కేటగిరీలో ఉన్నారు.
Advertisement
గ్రేడ్ B :
- BCCI: ఏడాదికి రూ.3 కోట్లు., వృద్ధిమాన్ సాహా, ఉమేష్ యాదవ్, యజువేంద్ర చాహల్, హార్దిక్ పాండ్యా, మయాంక్ అగర్వాల్‌లు ఈ కేటగిరీలో ఉన్నారు.
- PCB: ఏడాదికి 42 లక్షలు. అసద్ షఫీక్, హారిస్ సోహెల్, మహమ్మద్ అబ్బాస్, షాదాబ్ ఖాన్, ఆబిద్ అలీ, మహమ్మద్ రిజ్వాన్, సర్ఫరాజ్ అహ్మద్, షాన్ మసూద్, యాసిర్ షా లు ఈ కేటగిరీలో ఉన్నారు.
గ్రేడ్C:
- BCCI: ఏడాదికి రూ.1 కోటి. కేదార్ జాదవ్, నవదీప్ సైనీ, దీపక్ చాహర్, మనీష్ పాండే, హనుమ విహారి, శార్దూల్ ఠాకూర్, శ్రేయాస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్ లు ఈ కేటగిరీలో ఉన్నారు.
- PCB: ఏడాదికి రూ.30 లక్షలు. ఫఖర్ జమాన్, ఇమాద్ వసీం, ఇమామ్-ఉల్-హక్, నసీం షా, ఇఫ్తిఖర్ అహ్మద్, ఉస్మాన్ శిన్వారిలు ఈ కేటగిరిలో ఉన్నారు.
Also Read: కరోనా బారిన పడిన క్రికెటర్లు ఎవరో తెలుసా..?