సాధారణంగా తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల మధుమేహం, గుండె జబ్బులు పెరగడమే కాకుండా దాని ప్రభావం జుట్టు మీద కూడా కనిపిస్తోంది. ప్రతి ఒక్కరూ పొడవాటి, మందపాటి మరియు నల్లటి జుట్టును కోరుకుంటారు. కానీ ఈరోజుల్లో జుట్టు రాలే సమస్య సర్వసాధారణమైపోయింది. అందుకోసం అని ప్రజలు అనేక రకాల చికిత్సలు చేయించుకుంటున్నారు. అంతేకాకుండా జుట్టు పొడవుగా, ఒత్తుగా ఉండడం కోసమని వివిధ రకాల ప్రొడక్ట్స్ ను వాడుతున్నారు. అయితే మీరు మీ జుట్టు పొడవును పెంచుకోవడానికి కొన్ని హోమ్ రెమెడీస్ ఉన్నాయి. జుట్టు ఒత్తుగా పెరిగేలా చేయడంలో మనకు కరివేపాకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
Advertisement
ఇందులో విటమిన్ బి, సి, ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరిగేలా చేయడంలో సహాయపడతాయి. ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.మీరు జుట్టు పెరుగుదలను పెంచుకోవాలనుకుంటే కొబ్బరి నూనెలో కరివేపాకును కలపండి. అందుకోసం ముందుగా బాణలిలో కొబ్బరి నూనె తీసుకుని అందులో ఎనిమిది నుంచి తొమ్మిది కరివేపాకు ఆకులు వేసి మరిగించాలి. బాగా చల్లారిన తర్వాత మీ తలకు, జుట్టుకు అప్లై చేసి మసాజ్ చేయండి. సుమారు గంట తర్వాత తేలిక పాటీ షాంపుతో కడగాలి.
Advertisement
జుట్టు ఒత్తుగా ఉండాలంటే కరివేపాకుతో పాటు.. మెంతి గింజలను కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం ముందుగా కరివేపాకును పేస్టులా చేసుకోవాలి. అందులో రెండు చెంచాల మెంతిపొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ తలకు పట్టించే 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత నీటితో కడగాలి. మీరు దీన్ని వారానికి రెండు నుండి మూడుసార్లు ఉపయోగించవచ్చు. జుట్టు పెరగాలంటే కరివేపాకు, జామకాయతో హెయిర్ మాస్క్ తయారు చేసి అప్లై చేసుకోవచ్చు. అందుకోసం ఒక ఉసిరికాయను మిక్సీలో రుబ్బుకోవాలి. తర్వాత అందులో ఒక చెంచా కరివేపాకు పేస్ట్ వేయాలి. ఇప్పుడు ఈ పేస్ట్ ను జుట్టుకు అప్లై చేసి సుమారు ఒక గంట పాటు అలాగే ఉంచండి. ఈ హెయిర్ మాస్క్ తో మీ జుట్టు పెరగడమే కాకుండా నిగనిగలాడుతుంది.