Home » రామ్ చరణ్ సినిమాలో హీరోయిన్ గా సాయిపల్లవి నటించనుందా ?

రామ్ చరణ్ సినిమాలో హీరోయిన్ గా సాయిపల్లవి నటించనుందా ?

by Anji
Ad

మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి న్యాచురల్ హీరోయిన్ సాయి పల్లవి సినిమా చేయనుందనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే సాయి పల్లవి ఎంపిక చేసుకునే సినిమాలు ఎలా ఉంటాయో ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.  కమర్షియాలిటీ ఎక్కువగా ఉన్న సినిమాల్లో సాయి పల్లవి అస్సలు నటించదు. ఇక ఆ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కు యాక్టింగ్ స్కోప్ ఉంటేనే చేస్తుంది. అంతే  హీరోయిన్ ను గ్లామర్ బొమ్మగా, ఎక్స్  పోజింగ్ కు, సాంగ్స్ కోసం, రొ** మాం **టిక్ సీన్స్ కోసం అయితే సాయిపల్లవి ఒప్పుకోదు. ఇప్పటివరకు అలాంటి సినిమాలు  అసలు చేయననే  చెప్పేసింది కూడా.

Advertisement

అలాంటి పాత్ర ఉంటే.. సూపర్ స్టార్ సినిమా అయిన సరే రిజెక్ట్ చేస్తుంది. గతంలో మహేష్ బాబు సినిమాలో ఛాన్స్ వస్తే మొదట ఓకే అనుకున్న కథ విని వెంటనే రిజెక్ట్ చేసింది సాయిపల్లవి. ఇదిలా ఉండగా.. తాజాగా రామ్ చరణ్ సినిమాలో నటించనుందనే వార్త ఒకటి తెగ  వైరల్ అవుతోంది. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే చెర్రీ హీరోగా నెక్స్ట్ సినిమాను ఉప్పెన ఫేం బుచ్చిబాబు సన డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమాలో రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. ముందు మృణాల్ పేరు వినబడింది. ఆ తర్వాత జాన్వకపూర్ పేరు లైన్లోకొచ్చింది. ఇప్పుడు వీళ్లిద్దరూ కాదు సాయి పల్లవి అని కొత్త వార్త మీడియాలో హల్ చల్ చేస్తుంది.

Advertisement

 


ఈ సినిమా రూరల్ నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్ డ్రామా కావడంతో హీరోయిన్ గా సాయి పల్లవి అయితేనే బాగుంటుందని బుచ్చిబాబు భావించాడట. సాయి పల్లవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. గ్రామీణ అమ్మాయిగా కనిపించనుందనే టాక్. పాత్రకు ప్రాధాన్యత కూడా ఎక్కువగానే ఉంటుంది. సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. అంతే కాదు త్వరలోనే షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై నిర్మించనున్నారు. రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గురించి కీలక ప్రకటన ఇవ్వనున్నారని సమాచారం.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading