Home » బేబీ మూవీ హీరోయిన్ రెమ్యునరేషన్ అంత భారీగా తీసుకుంటుందా ?

బేబీ మూవీ హీరోయిన్ రెమ్యునరేషన్ అంత భారీగా తీసుకుంటుందా ?

by Anji
Ad

సాధారణంగా సినీ ఇండస్ట్రీకి ఎంతో మంది నటులు వస్తుంటారు. పోతుంటారు. అందులో కొందరూ మాత్రమే మంచి సక్సెస్ సాధిస్తుంటారు. ముఖ్యంగా నటన టాలెంట్ కాస్త లక్ ఉండాలే కానీ మనం అనుకున్నది ఏదైనా సాధించవచ్చు. అలా ఇండస్ట్రీలో యూట్యూబ్, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఓ మోస్తారు గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి చైతన్య బేబీ సినిమాతో సూపర్ హిట్ కొట్టేసింది. సాయి రాజేష్ దర్శకత్వంలో  తెరకెక్కిన ఈ చిన్న మూవీ సంచలనమైన విజయాన్ని సాధించింది.

Advertisement

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం 92 కోట్ల గ్రాస్ వసూలు సాధించి రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమాతో వైష్ణవి చైతన్యకు  ఓవర్ నైట్ లోనే స్టార్డం వచ్చింది. ఈమె పాత్రకు 100% న్యాయం చేసిందని ఎన్నో కామెంట్లు కూడా వినిపించాయి. ఇదే క్రేజ్ తో వరుసగా ఆఫర్లు అందుకుంటుంది వైష్ణవి. ప్రొడ్యూసర్ దిల్ రాజుతో కూడా వైష్ణవి ఒక సినిమా చేయబోతుందట. కొత్త దర్శకుడు అరుణ్ భీమవరపు దర్శకత్వంలో సినిమా కూడా రాబోతుందని తెలుస్తోంది. అంతేకాకుండా దిల్ రాజ్ సోదరిని కొడుకైన ఆశీష్ నుంచి మూడో సినిమా కూడా ఒప్పుకుందట.

Advertisement

అయితే ఈ చిత్రంలో నటించేందుకు మాత్రం వైష్ణవి చైతన్యకు కోటి రూపాయల పైగానే రెమ్యూనరేషన్ ఇస్తున్నట్టు సమాచారం. తెలుగు అమ్మాయి హీరోయిన్ గా రాణించడమే అరుదు అని అందరూ అనుకున్న తరుణంలో కోటి రూపాయలు అందుకునే రేంజ్ కి ఎదగడం గొప్ప విషయమే అంటున్నారు కొంతమంది సినీ విశ్లేషకులు. ఈ విధంగా వైష్ణవి చైతన్య వరుసగా ఐదు సినిమాలు రెడీగా పెట్టుకొని ఇండస్ట్రీలో దూసుకుపోతుందని చెప్పవచ్చు. మొత్తానికి ఈ హీరోయిన్ కి బేబీ మూవీ చాలా కలిసి వచ్చిందనే చెప్పాలి. ఆ ఒక్క సినిమాతోనే ఆమె లైఫ్ చేంజ్ అయింది. 

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading