సూపర్ స్టార్ కృష్ణ గురించి తెలియని తెలుగు సినీ ప్రేక్షకుడుండడు. ఎన్నో సినిమాల్లో నటించి అప్పట్లో సంచలనమే సృష్టించాడు. ముఖ్యంగా 1972లో ఒక్క సంవత్సరంలోనే ఏకంగా 18 సినిమాలు చేశాడు. ఇది వింటుంటేనే విచిత్రంగా ఉంది. రోజుకు మూడు షిప్టులను అలవోకగా లాగించేవాడు. అలా ఎందుకు అయ్యాడు. పనే జీవితంగా కృష్ణ ఎందుకు మారిపోయాడు..? అంటే దానికి ఓ కారణం ఉందండోయ్.. సూపర్ స్టార్ అంతటి గడ్డు రోజులున్నయ్. మరీ 1991, 1992 ప్రాంతాల్లో కృష్ణకి అవకాశాలు లేవు. వాస్తవానికి చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. కనిపిస్తే చాలు.. నిర్మాతలు మొహాలు చాటేసే వాళ్లు.. దాటేసే వాళ్లు.. కృష్ణకు అప్పటికే ఇండస్ట్రీ వాతావరణం తెలుసు.
Advertisement
సక్సెస్ లేకపోతే ఎవ్వడూ పట్టించుకోడు. ఓ మంచి అవకాశం కోసం ఎదురుచూస్తు అసహనంగా తిరిగేవాడు కృష్ణ. ఇక ఆ తరువాత తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వంలో వచ్చినటువంటి పచ్చటి సంపారం క్లిక్ అయింది. అది కమర్షియల్ కాస్త బాగానే నడిచేసరికి కృష్ణకి మళ్లీ ఫోన్లు వచ్చాయి. తరువాత బిజీ అయిపోయాడు. అల్లూరి సీతారామరాజు చేశాక.. ఆ పాత్ర ప్రభావం కృష్ణ మీద బాగానే పడింది. దీంతో ప్రేక్షకులు ప్రతీ పాత్రను అల్లూరితో పోల్చుకునేవారు. దీంతో మళ్లీ వరుసగా సినిమాలు ఫ్లాప్.. కాకపోతే తను అప్పటికే ఇండస్ట్రీలో సెటిలైపోయాడు. అవసరం అయితే తనే ప్రయోగాత్మక సినిమాలను నిర్మించేవాడు. తప్ప వేరే నిర్మాతలను రిస్క్ లో పడేసే వాడు కాదు.
Advertisement
ఇక అప్పట్లో సీనియర్ ఫిలీం జర్నలిస్టులు పీఎస్ఆర్ ఆంజనేయశాస్త్రీ, మోహన్ దివాకర్ లతో కృష్ణ.. శాస్త్రీ మర్యాదకు మీరు బిజీ సార్.. దొరకరు, ఎప్పుడూ షూటింగ్ లు అంటూ అనబోతుంటే.. కృష్ణ మధ్యలోనే నవ్వేసి. . నిజం చెప్పాలంటే శాస్త్రీ గారు ప్రస్తుతం నా చేతిలో ఒక్క సినిమా లేదు పదండి.. గంటల కొద్ది మాట్లాడుకుందాం అన్నాడు. అదేంటి మీకు సినిమాలు లేకపోవడం ఏంటి..? నిర్మాతలు క్యూ కట్టాలి కదా అని అడిగితే.. నిర్మొహమాటంగా ఇక్కడ సక్సెస్ మాత్రమే మాట్లాడుతుంది. అదే శాపిస్తుంది ఇప్పుడు.. వరుసగా నాకు కొన్ని ఫ్లాప్ సినిమాలు వచ్చాయి. దీంతోనే షూటింగ్ లేక గడ్డు రోజులు గడపాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు సూపర్ కృష్ణ. మరోవైపు తన ఎదురుగా వస్తుంటే.. నిర్మాతలు తమ కార్లను పక్క దారుల్లోకి మళ్లించేవారని.. కనిపిస్తే ఎక్కడ సినిమా ఛాన్స్ లు అడుగుతానేమోనని వారి భయం వెల్లడించారు.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!