కమెడియన్ సత్యం రాజేష్ తాజాగా నటించిన చిత్రం పొలిమేర 2. గతంలో విడుదల అయిన మా ఊరి పొలిమేర సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిన విషయం తెలిసిందే. కాగా పార్ట్ వన్ లో మర్డర్ మిస్టరీకి చేతబడి అంశాన్ని జత చేసి ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక పొలిమేర పార్ట్ 2 లో ఆ విషయాలన్నీ కూడా రివీల్ చేస్తారు. జాస్తిపల్లి ఊరి పొలిమేరలో ఉన్న ఏకపాదమూర్తి గుడికి కేరళలో ఉన్న అనంత పద్మనాభస్వామి గుడికి లింక్ ఉందని అక్కడ నిధులు ఉన్నాయని కొమిరి చేసే క్షుద్రపూజల వల్ల వాటిని సొంతం చేసుకోవచ్చని ఇలా ఒక కథాంశంతో దర్శకుడు సినిమాను చాలా చక్కగా రూపొందించారు.
Advertisement
సినిమాలో భాగంగా ఆ గుడి జాస్తిపల్లిలో ఉంది అని చెప్పారు. కానీ ఆ గుడి ఉండేది ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా వద్ద ఉన్న గండికోటలో ఉంది. మాధవరాయ దేవాలయం ఆంధ్ర ప్రదేశ్ లోని కడప జిల్లాలో గండికోట కోటలో ఉన్న 16వ శతాబ్దపు హిందూ దేవాలయం. అప్పట్లో కృష్ణుడి ప్రతిమ ఉండేది. దీనిని మాధవ పెరుమాళ్ ఆలయం లేదా మాధవరాయ స్వామి ఆలయం అని కూడా పిలుస్తారు. కాగా భారత ప్రభుత్వం దీనిని జాతీయత ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా గుర్తించింది. ఈ గుడిలో రాధేశ్యామ్, సైరా నరసింహారెడ్డి, ఇండియన్ 2, మర్యాద రామన్న లాంటి సినిమాల షూటింగ్ ఇక్కడ జరిగాయి.
Advertisement
ఇక పోతే గుడి చరిత్ర విషయానికి వస్తే.. ఆలయంలోని కళ, నిర్మాణ లక్షణాల విశ్లేషణ ఆధారంగా చూస్తే దీనిని 16వ శతాబ్దం మొదటి త్రైమాసికంలో నిర్మించినట్లు తెలుస్తుంది. ఆలయానికి సంబంధించిన తొలి ప్రస్తావన 16వ శతాబ్దపు శాసనాలలో కనుగొనబడింది. గండికోటలో విజయనగర కాలం నాటి రాజులు నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయి. 16వ శతాబ్దపు శాసనాలు ఆ గుడిలో కనుగొనబడ్డాయి. పాపా తిమ్మరాజు అనే వ్యక్తితో సహా అనేక మంది వ్యక్తులు మాధవరాయ అనగా కృష్ణుడికి నమస్కరించి, దేవుడికి మాల సమర్పించారని పేర్కొంది. మరి నిజంగానే ఆ గుడిలో నిధులు ఉన్నాయా అంటే మహ్మదీయుల దాడుల వల్ల ఈ గుడి పూర్తిగా కూలిపోయింది. ఆ సమయంలో గుడిలో ఉన్న విగ్రహాన్ని అక్కడి నుంచి కడప జిల్లాలోని మైదుకూరుకు తరలించినట్లు ఆధారాలు ఉన్నాయి.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!