Home » రవితేజ కూతురు వయసున్న హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడా..?

రవితేజ కూతురు వయసున్న హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడా..?

by Anji
Ad

తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎదిగిన వారిలో మాస్ మహారాజా రవితేజ ఒకరు. ఈయన చిన్న హీరో నుండి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ముందుగా చిన్నచిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించిన రవితేజ హీరోలకు తమ్ముడు క్యారెక్టర్లలో నటించి ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అలా మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకొని వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు రవితేజ. ప్రస్తుతం రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.


ఇటీవల టైగర్ నాగేశ్వరరావు అంటూ ప్రేక్షకుల ముందుకి వచ్చిన రవితేజ, ఇప్పుడు ఈగల్ చిత్రంతో సంక్రాంతి పండుగ బరిలో ఉన్నారు. అయితే రవితేజ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. ఈయన నీరజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఒక కొడుకు, ఒక కూతురికి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రవితేజ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే రవితేజ కి పెళ్లై పిల్లలు ఉన్నప్పటికీ తన కూతురు వయసు ఉన్న హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట.

Advertisement

Advertisement


ఆ హీరోయిన్ మరెవరో కాదు శ్రీలీల. రవితేజ, శ్రీలీల కాంబినేషన్ లో తెరకెక్కిన ధమాకా సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే రవితేజ కంటే శ్రీలీల వయసులో చాలా చిన్నది అయినప్పటికీ ఈ చిత్రంలో ఆమె రవితేజతో కలిసి రొమాంటిక్ సన్నివేశాలలో దూరిపోయి నటించింది. అయితే రవితేజ వాస్తవానికి ఎంత ఫన్నీగా ఉంటారో మనసు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ధమాకా మూవీ షూటింగ్ సమయంలోనే రవితేజకి శ్రీలీలతో ఉన్న మంచి బాండింగ్ తో నన్ను పెళ్లి చేసుకుంటావా అని శ్రీలీలను అడిగారట. అయితే ఇది రవితేజ కేవలం ఫన్నీ గానే అడిగారని, అంతే కానీ వేరే ఉద్దేశంతో కాదని తెలుస్తోంది.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading