దీపావళి పండుగ సందర్భంగా తెలుగు మరియు తమిళ భాషల్లో ఒకేసారి కార్తీ హీరోగా నటించిన జపాన్ సినిమా అలాగే లారెన్స్ ప్రధాన పాత్రలో నటించిన జిగర్ తండా డబుల్ ఎక్స్ విడుదల అయ్యాయి. ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. రెండు భాషల్లో పండుగకు రిలీజ్ అయిన సినిమాల్లో ఇవే భారీ బడ్జెట్ మూవీస్ కావడం విశేషం. జపాన్ సినిమాకు రాజు మురుగన్ డైరెక్టర్ కాగా.. జిగర్ తండా సీక్వెల్ కు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించాడు.
భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. భారీ నష్టాల దిశగా సాగుతున్నాయి. కార్తి జపాన్ మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 15 కోట్లకు పైగా గ్రాస్ ఏడున్నర కోట్ల వరకు షేర్ కలెక్షన్లను రాబట్టింది. తెలుగులో ఈ మూవీ ఇప్పటివరకు మూడున్నర కోట్ల వరకు గ్రాస్ ను, కోటి 70 లక్షల వరకు షేర్ కలెక్షన్స్ దక్కించుకున్నట్లు సమాచారం. తొలి రోజు జపాన్ మూవీకి కోటికి పైగా కలెక్షన్స్ వచ్చాయి. కానీ నెగెటివ్ టాక్ కారణంగా, మూడో రోజు వసూళ్లు మరీ దారుణంగా పడిపోయాయి. ఆదివారం రోజు ఈ సినిమా 35 లక్షల వరకు మాత్రమే వసూళ్లను సొంతం చేసుకుంది.
Advertisement
Advertisement
జపాన్ సినిమాలో కార్తీ సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించినది. అలాగే లారెన్స్ ఎస్ జే సూర్య హీరోలుగా నటించిన జిగర్ తాండ డబుల్ ఎక్స్ తెలుగు ప్రేక్షకులను పూర్తిగా నిరాశపరిచింది. మూడు రోజుల్లో ఈ మూవీకి రెండు కోట్ల నలభై లక్షల వరకు గ్రాస్ అలాగే కోటి 20 లక్షల షేర్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మూడో రోజు ఈ సినిమా 50 లక్షల వరకు వసూళ్లు దక్కించుకున్నట్లు సమాచారం. తెలుగులో కార్తీ జపాన్ సినిమా కంటే జిగర్ తాండ సినిమాకు ఎక్కువగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. జపాన్ నాలుగు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో విడుదల అవ్వగా.. జిగర్ తాండ డబుల్ ఎక్స్ ఐదున్నర కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో విడుదల అయింది. రెండు సినిమాల కలెక్షన్స్ చూస్తుంటే తెలుగులో బ్రేక్ ఈవెంట్ కావడం కష్టంగానే కనిపిస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.