Home » బిగ్ బాస్‌లో ఉండగానే బంపర్ ఆఫర్ కొట్టేసిన అర్జున్.. రామ్ చరణ్ మూవీలో కీలక పాత్ర..!

బిగ్ బాస్‌లో ఉండగానే బంపర్ ఆఫర్ కొట్టేసిన అర్జున్.. రామ్ చరణ్ మూవీలో కీలక పాత్ర..!

by Anji
Ad

బిగ్ బాస్ హౌస్ లో ఆదివారం  రోజు దీపావళి సంబురాలు జరిగాయి. నిన్న జరిగిన ఎపిసోడ్ లో కింగ్ నాగార్జున స్టేజ్ సందడి చేశారు. దీపావళి సందర్భంగా స్పెషల్ ఎపిసోడ్ జరిగింది. గతవారం హౌస్ మేట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ను పంపించి ఎమోషనల్ అయ్యేలా చేశారు. చాలా రోజుల తర్వాత తమ వారిని చూసుకొని ఎమోషనల్ అయ్యారు హౌస్ మేట్స్. ఇక నిన్న జరిగిన ఎపిసోడ్ లో కూడా నాగార్జున హౌస్ మేట్స్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫెండ్స్ ను స్టేజ్ పైకి పిలిచారు. శివాజీ చిన్న కొడుకు ఆయన భార్య, ప్రియాంక కోసం ఆమె మదర్, నటి ప్రగతి.. అమర్ దీప్ కోసం అతని తల్లి, నటుడు మానస్.

Advertisement

అలాగే ప్రశాంత్ కోసం అతని తల్లి, అక్క.. యావర్ కోసం అతని అన్న , కమెడియన్ ఇమాన్యుల్.. అర్జున్ కోసం దర్శకుడు బుచ్చిబాబు..శోభా శెట్టి కోసం ఆమె తండ్రి, ప్రియుడు.. గౌతమ్ కోసం అతని తండ్రి, నటుడు చైతన్య స్టేజ్ పైకి వచ్చారు. వీరిలో అర్జున్ కోసం వచ్చిన దర్శకుడు బిచ్చిబాబు అతని ఓ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. బుచ్చిబాబు ఉప్పెన సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన విషయం తెలిసిందే. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన బుచ్చిబాబు దర్శకుడిగా చేసిన తొలి సినిమా ఉప్పెన భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఏకంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నాడు బుచ్చిబాబు. ఇటీవలే ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేశారు. 

Advertisement

త్వరలోనే ఈ మూవీ షూటింగ్ మొదలు కానుంది. చరణ్ ప్రస్తుతం చేస్తున్న శంకర్ సినిమా పూర్తయిన వెంటనే బుచ్చిబాబు సినిమాను మొదలు పెట్టనున్నాడు. ఈ సినిమాలో కీలక పాత్రలో అర్జున్ నటిస్తున్నాడు. నిన్న బిగ్ బాస్ కు వచ్చిన బుచ్చిబాబు అర్జున్ కు ఈ బంపర్ ఆఫర్ ఇచ్చి హ్యాపీ చేశాడు. దీంతో అర్జున్ ఆనందంలో మునిగిపోయాడు. వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన అర్జున్ తన గేమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా దూసుకుపోతున్నాడు. అర్జున్  టాప్ 5 లో ఉండటం ఖాయం అంటున్నారు ప్రేక్షకులు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ నుంచి బయటకు రాకుండానే చరణ్ సినిమాలో ఛాన్స్ అందుకున్నాడు. బయటకు వచ్చిన తర్వాత మరిన్ని ఆఫర్స్ వస్తాయేమో వేచి చూడాలి మరీ. 

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading