టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. తన వైవిద్యమైన నటనతో సినీ అభిమానులను అలరించిన సీనియర్ నటుడు చంద్రమోహన్ నవంబర్ 11, 2023న తుదిశ్వాస విడిచారు. గత కొద్ది నెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ నటులు, అభిమానులు, రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు.
Advertisement
1966లో రంగుల రాట్నం మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు చంద్రమోహన్. దాదాపు ఆరు దశాబ్దాల కాలం పాటు తన కెరీర్ లో వందలాది చిత్రాల్లో నటించారు. హీరోగా, నటుడిగా, కమెడీయన్ గా, విభిన్నపాత్రల్లో దాదాపు 932 సినిమాల్లో పైగా సినిమాల్లో మెప్పించారు. అలనాటి స్టార్ హీరోయిన్స్, శ్రీదేవి, జయసుధ, జయప్రద లాంటి వారితో సినిమాలు చేశారు. తన 55 ఏళ్ల సినీ కెరీర్ లో చివరిసారిగా గోపిచంద్ నటించిన ఆక్సిజన్ సినిమాలో చంద్రమోహన్ కనిపించారు. చంద్రమోహన్ తెలుగుతో పాటు తమిళంలో కూడా చాలా సినిమాల్లో నటించారు. ముఖ్యంగా చంద్రమోహన్ నటించిన పదహారేళ్ల వయసు మూవీలో చంద్రమోహన్ చేసిన డీ గ్లామర్ పాత్ర విమర్శకుల ప్రశంసలను అందుకుంది.
Advertisement
సినీ కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. సూపర్ స్టార్ కృష్ణ నటించిన తేనెమనసులు సినిమాకి తొలుత ఆడిషన్స్ ఇచ్చాడట. అయితే ఆ సినిమా కృష్ణ చేతికి పోయింది. ఇక లాభం లేదనుకొని ఉద్యోగం చేసుకుంటున్న అతని ఫోటో చూసి బీ.ఎన్.రెడ్డిగారు పిలిచి రంగులరాట్నం మూవీలో అవకాశాన్ని ఇచ్చారట. ఒకానొక సమయంలో అసలు మద్రాస్ వదిలి వెళ్లిపోదామనుకున్నారట. కానీ ఇంత దూరం వచ్చింది పట్టుదలగా ఎదగడానికే కానీ పిరికితనంతో పారిపోవడానికి కాదు అని నిర్ణయించుకుంది. సినీ ఇండస్ట్రీలో చంద్రమోహన్ కి లక్కీ హీరో అనే పేరు ఉంది. అతనితో ఏ సినిమా చేసిన ఏ హీరోయిన్ కి అయినా సక్సెస్ కలిసి వస్తుంది అని అందరికీ నమ్మకం.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!