సీనియర్ హీరో, నటుడు, కమెడీయన్, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా పాత్ర ఏదైనా అందులో లీనమైపోయే నటుడు చంద్రమోహన్. బహుముఖ ప్రజ్ఞాశీలిగా ఓ వెలుగు వెలిగిన దిగ్గజ నటుడు నవంబర్ 11, 2023న తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ఈ తరుణంలో ఆయనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు బయటికి వస్తున్నాయి. ఇందులో చంద్రమోహన్ ఒక్క రూపాయి కథ ఒకటి. 1966లో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చంద్రమోహన్ ఇప్పటివరకు దాదాపు 932కి పైగా సినిమాల్లో నటించారు. 150 నుంచి 170 వరకు సినిమాల్లో హీరోగానే నటించి మెప్పించారు.
Advertisement
ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించారు. అదే సమయంలో ఆయనకు చంద్రమోహన్ అంటే లక్కీ హ్యాండ్ అనే పేరు వచ్చింది. దానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. ఆయనతో వెండి తెరను పంచుకున్న హీరోయిన్లు అందరూ ఆ తరువాత టాప్ రేంజ్ కి దూసుకెళ్లారు. ఒకప్పటి అతిలోకసుందరి శ్రీదేవి కూడా ఆయనతోనే హీరోయిన్ గా మొదటి సినిమా చేసింది. కేవలం శ్రీదేవి మాత్రమే కాకుండా జయసుధ, జయప్రద, రాధ, రాధిక విజయశాంతి వంటి అలనాటి నటీమణులకు ఆయనతో సినిమా చేసాకే స్టార్ హీరోయిన్లుగా అదృష్టం కలిసొచ్చింది. ఇక అలాంటి సమయంలోనే ఇండస్ట్రీలో ఎవ్వరైనా నిర్మాతగా రాణించాలంటే ముందుగా తమ మొదటి సినిమాను చంద్రమోహన్ తోనే చేసే వారట. ఆయనతో చేసే తక్కువ బడ్జెట్ లో పూర్తి అవ్వడమే కాకుండా చెప్పిన సమయానికి స్పాట్ కి వచ్చి షూటింగ్ లు చేసుకొని వెళ్లేవారట.
Advertisement
చంద్రమోహన్ నిర్మాతలను ఏవిధంగా ఇబ్బంది పెట్టేవారు కాదట. ఇలా నిర్మాతల హీరోగా మారిన ఆయన నటించిన సినిమాలన్నీ దాదాపు హిట్ అయ్యేవి. అలా మినిమం గ్యారెంటీ హీరోగా మారారు చంద్రమోహన్. ఆయన చేతితో డబ్బులు తీసుకున్నా.. లేదంటే ఆయన ఎవ్వరికైనా ఇచ్చినా అదృష్టం కలిసొస్తుందని బలంగా నమ్మేవారట. ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ గా వెలుగొందుతున్న అశ్వినిదత్ కూడా నిర్మాతగా తన తొలి సినిమాను చంద్రమోహన్ తోనే చేశారు. ఓ సీత కథ అనే మూవీ వీరిద్దరికాంబినేషన్ లో వచ్చింది. అందుకే అప్పట్లో ఆయనతో సినిమాలు చేయడానికి దర్శక, నిర్మాతలతో పాటు హీరోయిన్లు కూడా చాలా ఆసక్తి చూపించే వారట. అంతేకాదు.. తమ సినిమాల్లో చంద్రమోహన్ హీరో కాకపోయినా.. సినిమా తీసే ముందు ఆయన దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకునేవారు కాదట. అలా తీసుకోవడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని వాళ్ల నమ్మకం అంట. చంద్రమోహన్ ఒక్క రూపాయి స్టోరీ వెనుక ఉన్న అసలు రహస్యం ఇది.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!