టాలీవుడ్ డైరెక్టర్ శ్రీనువైట్ల తెరకెక్కించిన మిస్టర్ మూవీ షూటింగ్ సమయంలో ప్రేమించుకున్న వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి నవంబర్ 01న వీరి పెళ్లి జరిగింది. ఇటలీలో ఈనెల 1న వీరి వివాహం జరిగింది. మెగా ఫ్యామిలీ నుంచి దాదాపు అందరూ వీరి వివాహ వేడుకకు హాజరయ్యారు. ఇరు కుటుంబాల మధ్య వీరు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోగా.. నవంబర్ 05న టాలీవుడ్ సినీ ప్రముఖులు, పలువురు రాజకీయ ప్రముఖుల కోసం హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్ లో వీరు రిసెప్షన్ జరుపుకున్నారు. వీరి పెళ్లి రిసెప్షన్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Advertisement
వరుణ్ తేజ్ పెళ్లి జరిగి 11 రోజులు అయింది. అయితే అప్పుడే ఆయన సినిమా షూటింగ్స్ లో పాల్గొనేందుకు సిద్ధమైనప్పట్టు తెలుస్తోంది. లావణ్యతో హనిమూన్ కి వెళ్లకుండా ఈ యువ హీరో ప్రస్తుతం మట్కా ఆపరేషన్ వాలెంటైన్ మూవీలో నటిస్తున్నారు. వరుణ్ తేజ్ కి గత కొంత కాలంగా సినిమాల్లో కలిసి రావడం లేదనే విషయం అందదరికీ తెలిసిందే. చివరిసారిగా గాంఢీవదారి అర్జున మూవీలో నటించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో వరుణ్ ఈ సినిమాలతో ఎలా అయినా హిట్ కొట్టాలని.. భావిస్తున్నాడట. అయితే వరుణ్ సినిమా వర్క్ విషయంలో లావణ్య త్రిపాఠి కూడా చాలా ఫేవర్ గా ఉందని స్పష్టమవుతోంది.
Advertisement
ఇదిలా ఉంటే.. లావణ్య త్రిపాఠి పిల్లల విషయంలో మాత్రం తన అక్క ఉపాసనని ఫాలో అవుతున్నట్టు సమాచారం. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు పెళ్లి జరిగి పదకొండేళ్లకు పాప జన్మించగా.. లావణ్య త్రిపాఠి పిల్లల విషయంలో అలాంటి నిర్ణయం తీసుకుందనే టాక్ వినిపిస్తోంది. లావణ్య త్రిపాఠి కొన్ని సంవత్సరాల పాటు పిల్లలకు దూరంగా ఉంటుందట. సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటించాలని ఈ భామ భావించడంతో పాటు ఒక ప్రొడక్షన్ హౌస్ తో స్టార్ట్ చేయాలని కూడా ఫిక్స్ అయిందట. అదేవిధంగా ఓ బ్రాండెడ్ డిజైనర్ షోరూం కూడా ఓపెన్ చేయాలని సెలబ్రిటీస్ లైఫ్ స్టైల్ కి సంబంధించిన దుస్తులను తక్కువ ధరకే సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఓ వెబ్ సైట్ ని కూడా రూపొందించాలని లావణ్య అనుకుంటుందట. వీటన్నింటినీ ఓ రేంజ్ కి తీసుకెళ్లేందుకు పదేళ్లపాటు సమయం పడుతుందని అప్పటివరకు తనకు పిల్లలు వద్దని డిసైడ్ అయిందట లావణ్య త్రిపాఠి.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!