టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ ఫ్యామిలీలో మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముగ్గురు అన్నదమ్ములు అనే విషయం దాదాపు అందరికీ తెలిసిందే. ఇలాంటి ఆణి ముత్యాలను కన్న తండ్రి పేరు కొణిదెల వెంకటరావు. ఆయన బతికున్నప్పుడు కానిస్టేబుల్ గా పని చేశారు. మంచి స్పోర్ట్స్ బాడీ ఉన్న వెంకటరావు రిటైర్ అయ్యాక మాత్రం ఫిజికల్ యాక్టివిటీని పూర్తిగా తగ్గించేశారట. ఆయన మరణానికి అదే కారణం అన్నట్లు నాగబాబు తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన తండ్రికి డయాబెటిస్ కూడా ఉందని తెలిపారు. డయాబెటిస్ ఉన్న సరే తన తండ్రి రిటైర్ అయ్యాక కుర్చికే పరిమితమయ్యాడని.. యాక్టివ్ లైఫ్ స్టైల్ కొనసాగించలేదన్నారు.
Advertisement
దీంతో అతని ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించిందని తెలిపాడు. ఒక డయాబెటిస్ తప్ప తన నాన్నకు ఎలాంటి వ్యాధులు లేవని నాగబాబు వెల్లడించాడు. ఉన్న ఆ ఒక్క రోగాన్ని సరిగా మేనేజ్ చేసుకుని ఉంటే కొంతకాలం తన తండ్రి బతికే ఉండేవాడని చెప్పుకొచ్చాడు. రిటైర్ అవ్వకముందు పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఓ టైగర్ గా పని చేసే వాడని కూడా తెలిపారు. తన తండ్రి స్మోక్ కూడా చేసేవాడని.. కానీ దాని వల్ల అతని ఆరోగ్యానికి ఎలాంటి నష్టం వాటిల్ల లేదని తెలిపారు. అతని ఆరోగ్యం మెల్లగా క్షీణి స్తున్న సరే ఎలాంటి ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కోలేదని వెల్లడించాడు. వెంకట్రావు తమను ఎంతో బాగా చూసుకున్నాడని.. అలాగే కష్టపడి పని చేసే వాడని నాగబాబు తెలిపారు. ఫ్యామిలీ అంటే తన తండ్రికి చాలా ఇష్టమని.. తమకు బాగా ఎమోషనల్ గా అటాచ్ అయ్యారని వెల్లడించాడు.
Advertisement
తన తండ్రి ఫ్యామిలీ విషయానికి వస్తే.. చాలా సున్నితంగా ఉంటాడని కానీ, పోలీసు డ్యూటీలో ఉన్నప్పుడు చాలా సాహాసాలు చేసేవాడని అన్నారు. ఫైటింగ్ చేయడానికి కూడా వెంకట్రావు అస్సలు వెనకాడే వాడు కాదట. ఆ దైర్యమే పవన్ కళ్యాణ్ కి వచ్చినట్లు నాగబాబు పేర్కొన్నాడు. తను అన్నయ్య చిరంజీవికి తన నాన్న ధైర్యం లో 40% దాకా వచ్చిందని అన్నాడు. తనకు మాత్రం ఆ ధైర్యం అసలు రాలేదని తెలిపాడు. తాను చాలా బ్యాలెన్స్ గా ఆలోచించి ముందడుగు వేస్తానని అన్నాడు. కానీ పవన్ కళ్యాణ్ ముందు ఏం జరుగుతుందో తెలుసుకోకుండా తన తండ్రి లాగా ఏదైనా గుడ్డిగా ఎదుర్కోవడానికి సిద్దమవుతాడని వివరించాడు. నాగబాబు తన తండ్రి వెంకటరావు గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!