శాంతి, అభివృద్ధి కోసం ప్రపంచ విజ్ఞాన దినోత్సవాన్ని ఏటా నవంబర్ 10న జరుపుకుంటారు. ఈరోజు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే సమాజంలో ఉన్న సైన్స్ పాత్ర ప్రాముఖ్యతను ఇది తెలియజేస్తుంది. అలాగే మన రోజువారి జీవితాలకు సైన్స్ ఏవిధంగా ఉపయోగపడుతుంది అనే విషయాలను కూడా సూచిస్తుంది. అయితే ప్రతి ఏడాది ప్రపంచ సైన్స్ డే ను చాలా దేశాల్లో జరుపుకుంటారు. అంతేకాదు.. దీనికి ప్రతి సంవత్సరం ఓ థిమ్ కూడా ఉంటుంది. అయితే 2023 సైన్స్ డే కు కూడా ఓ కొత్త థీమ్ ను తీసుకొచ్చారు. ఈసారి అది ఏంటంటే.. విజ్ఞానంలో నమ్మకాన్ని పెంపొందించడం. వాస్తవానికి సైన్స్ పై నమ్మకం ఉన్నప్పుడే మన భవిష్యత్తును మార్చడంలో సైన్స్ పాత్ర నెరవేరుతుంది.
Advertisement
ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ల కోసం ఒక ఆధారత పరిష్కారాన్ని అభివృద్ధి చేసేందుకు సైన్స్ పై ఉన్న నమ్మకం ఒక ఇంధనంలాగా పనిచేస్తుంది. 1999లో హంగేరీలోని కూడా బుడాపెస్ట్ లో జరిగిన ప్రపంచ విజ్ఞాన సదస్సు నుంచి ఈ ప్రపంచ సైన్స్ డే అనే ఆలోచన ఉద్భవించింది. శాంతి, సుస్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడంలో సైన్స్ పాత్ర గురించి చర్చించేందుకు శాస్త్రవేత్తలు, చట్ట రూపకర్తలు, ఇతర వాటాదారులు ఇలా అందరూ ఈ సదస్సుకు హాజరయ్యారు. అయితే ఈ సదస్సు నిర్వహించడం వల్ల వచ్చిన ఫలితం ఏంటంటే.. 21 శతాబ్దపు సవాళ్లను ఎదుర్కొనేందుకు సైన్స్ ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం అలాగే.. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం.
Advertisement
ఇక 2001లో యునెస్కో ప్రతి ఏటా ప్రపంచ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకోవాలని ఓ తీర్మానాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ తీర్మానం శాంతి, సుస్థిరమైన అభివృద్ధి కోసం సైన్స్ పాత్ర ఉంటుందని గుర్తించింది. అలాగే సమాజంలో సైన్స్ పోషిస్తున్న పాత్రపై ప్రజల్లో అవగాహన కల్పించాలని పిలుపునిచ్చింది. వాస్తవానికి ఈ వరల్డ్ సైన్స్ డే జరుపుకోవడం అనేది ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే విజ్ఞాన రంగంలో వస్తున్న మార్పు, అభివృద్ధి గురించి ప్రజలకు దీని ద్వారా మరింత అవగాహన కల్పించవచ్చు. మన రోజువారి జీవితాల్లో సైన్స్ ఏ విధంగా ప్రభావితమవుతుందనే దాన్ని ఇది గుర్తుచేస్తుంది. ప్రభుత్వ అధికారుల నుంచి పాఠశాల విద్యార్థుల వరకు ఇలా అన్ని రంగాల వారు సైన్స్ పట్ల చూపించే ప్రోత్సాహాన్ని అలాగే ఉజ్వల భవిష్యత్తును రూపొందించడంలో దాని సామర్ధ్యాన్ని ఏకం చేసేందుకు ఈ వరల్డ్ సైన్స్ డే అనేది శక్తిని ఇస్తుంది.
తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.