ప్రస్తుత కాలంలో మనిషి 60 సంవత్సరాలు బ్రతకడమే చాలా కష్టంగా ఉంది. అలాంటిది ఈ తాత 98 సంవత్సరాల వయసులో గిన్నిస్ రికార్డు సాధించాడు. ఆయన అన్ని రోజులు బ్రతకడమే మహా కష్టం ఉంటే ఈ వయసులో కూడా గిన్నిస్ బుక్ లోకి ఎక్కడం చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇంతకీ ఆ తాత ఎవరు? ఆయనకి యాంకర్ సుమకి సంబంధం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
గత రెండు దశాబ్దాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన యాంకరింగ్ తో ఎంటర్టైన్ చేస్తూనే ఉంది సుమ. ప్రీ రిలీజ్ ఈవెంట్లు, రియాలిటీ షోలు ఇంటర్వ్యూలు, ఇలా ఏ కార్యక్రమం అయినా సరే సుమ ఉండాల్సిందే. అలాంటి సుమ మలయాళం అమ్మాయి అనే విషయం అందరికీ తెలుసు. సుమ వాళ్ళ బ్రదర్ బాలసుబ్రమణ్యన్ మీనన్ ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఆ రికార్డును సోషల్ మీడియా ద్వారా వారి అభిమానులతో పంచుకుంది.
Advertisement
Advertisement
ఆయన ఏం చేశారయ్యా అంటే సుబ్రహ్మణ్యన్ వయసు 98 ఏళ్లు. అడ్వకేట్ వర్క్ చేస్తున్నారు. అడ్వకేట్ వర్క్ లో ఇంతటి లాంగ్ కెరియర్ కంప్లీట్ చేసుకున్న ఏకైక లాయర్ గా వరల్డ్ రికార్డు సాధించాడు. దీంతో గిన్నిస్ బుక్ వారు ఆయనకు ప్రశంస పత్రంతో పాటు, నగదు బహుమతి కూడా అందించారు. ఈ రికార్డు ఆయన సొంతం కావడంతో సుమ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తన తాతకు వచ్చిన గుర్తింపును బయటపెట్టింది. దీంతో సుమ అభిమానులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.