Home » జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకండి.. జాగ్రత్త..! ఆ డైరెక్టర్ ట్వీట్ వైరల్

జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకండి.. జాగ్రత్త..! ఆ డైరెక్టర్ ట్వీట్ వైరల్

by Anji
Ad

టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల టాలీవుడ్ అభిమానులకు వార్నింగ్ ఇచ్చారు. జ్వరం వస్తే.. అస్సలు నిర్లక్ష్యం చేయకూడదని. ప్రజలతో పాటు ఫ్యాన్స్ కు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి చిన్న తప్పుతో ప్రాణాలు పోగొట్టుకోవద్దని ఆయన సూచించారు. ప్రస్తుతం వెంకీ కుడుముల చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.


ఓ ట్వీట్ లో వెంకీ కుడుముల  రాస్తూ.. కొన్ని వారాలుగా మా కజిన్ చాలా జ్వరంతో బాధపడుతున్నారు. అది సాధారణ జ్వరమేనని అనుకున్నారు. కానీ  సమాయానికి డాక్టర్ వద్దకు వెళ్లకపోవడంతో తీవ్ర పరిణామం చోటు చేసుకుంది. ఆ జ్వరం  కాస్త అరుదైన జీబీ సిండ్రోమ్ కు దారి తీసింది. సరైన సమయంలో సరైన చికిత్స తీసుకొని ఉంటే అసలు ఇలా జరిగేది కాదు.  చాలా ఆలస్యం చేయడం వల్ల నిండు జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుంది.  ఈ నిర్లక్ష్యం మా కుటుంబానికి తీరని దుఃఖాన్ని మిగిల్చింది. కోవిడ్ తర్వాత జ్వరాన్ని కూడా తేలికగా తీసుకుంటున్నారు. దయచేసి అలా చేయకూడదు.

Advertisement

Advertisement

జ్వరం వస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. వెంటనే వైద్యుని సంప్రదించండి అని సూచించాడు డైరెక్టర్ వెంకీ కుడుముల.   ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలే మన ప్రాణాలను కాపాడతాయి. అని ట్వీట్ లో  రాసుకొచ్చారు.  అయితే  దర్శకుడు  వెంకీ ప్రస్తుతం టాలీవుడ్ హీరో  నితిన్ తో ఇటీవలే ఓ  సినిమాను ప్రకటించారు. భీష్మ తర్వాత నితిన్, రష్మిక కాంబినేషన్ లో  ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని టాలీవుడ్ న్యూస్  కోసం ఇవి చూడండి.     తెలుగు న్యూస్ కోసం వీటిని వీక్షించండి.

Visitors Are Also Reading