Home » టాలీవుడ్ మొదటి హీరో కళ్యాణం రఘురామయ్య కుటుంబం గురించి మీకు తెలుసా ?

టాలీవుడ్ మొదటి హీరో కళ్యాణం రఘురామయ్య కుటుంబం గురించి మీకు తెలుసా ?

by Anji
Ad

టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటి హీరోగా పేరు తెచ్చుకున్నాడు కళ్యాణం వెంకటసుబ్బయ్య. ఇతడిని ఈలపాట రఘురామయ్య అని కూడా పిలుస్తారు. నిజానికి ఆ పేరుతోనే అతడు బాగా పాపులర్ అయ్యాడు. తెలుగు రంగస్థల, సినీ నటుడు గానే కాకుండా గాయకుడిగా రఘురామయ్య మంచి పేరు తెచ్చుకున్నాడు. గుంటూరు జిల్లా సుద్దపల్లిలో 1901 మార్చి 5న కళ్యాణం నరసింహారావు, కళ్యాణం వెంకట సుబ్బమ్మ దంపతులకు జన్మించాడు. అతనికి చిన్నతనం నుండే సంగీతం, నాటకాలలో మక్కువ ఉండేది. చిన్నతనం నుంచే మ్యూజిక్ నాటకాలలో రాణించేవాడు.


అతను తన గానంతో పశువులను కూడా మైమరిచిపోయేలా చేసేవాడు. నోటిలో గోళ్ళతో ఈలా వేస్తూ పాటలు పాడేవాడు. ఇలా ఈల పాటలు పాడితూ ఆకట్టుకునేవాడు. ఇక నాటక బృందంలో చేరి రఘురాముని పాత్రలో నటించి ఈలపాట రఘురామయ్యగా పేరు తెచ్చుకున్నారు. కృష్ణుడి పాత్రను కూడా ఎన్టీఆర్ తో పోల్చెంత బాగా నటించేవాడు. రఘురామయ్య టాలెంట్ గురించి తెలుసుకొని జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, సర్వేపల్లి రాధాకృష్ణ, వి.వి.గిరి వంటి ప్రముఖులే అతడిని ఎంతో పొగిడారు. నెహ్రూ రఘురామయ్య టాలెంట్ చూసి నమ్మలేకపోయారు.

Advertisement

Advertisement


ఆయన చేతిలో ఏదైనా పరికరాన్ని దాచారా అని కూడా అడిగి తన అపనమ్మకాన్ని వ్యక్తం చేసేవారు. దాన్ని బట్టి రఘురామయ్యకు ఎంత అరుదైన టాలెంట్ ఉందో అర్థం చేసుకోవచ్చు. రఘురామయ్య తన కెరీర్ లో సుమారు 20,000 నాటకాలు, 100 చిత్రాలలో నటించారు. శ్రీరామాంజనేయ యుద్ధంలోని ప్రసిద్ధ రామ నీల మేఘ శ్యామాతో సహా అనేక పాటలు కూడా పాడాడు. భారతీయ సాంస్కృతిక బృందంలో సభ్యుడిగా జపాన్, ఇతర తూర్పు ఆసియా దేశాలకు వెళ్లి తన ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కేంద్ర సంగీత, నాటక అకాడమీ అవార్డు, పద్మశ్రీ వంటి అవార్డులు అందుకున్నారు.


జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, సర్వేపల్లి రాధాకృష్ణ, వి.వి.గిరి, సత్యసాయి బాబా వంటి ప్రముఖులు మెచ్చుకున్నారు అంటే అతని ప్రతిభ ఏ పాటీతో అర్థం చేసుకోవచ్చు. దురదృష్టం కొద్దీ ఈ కళాకారుడు 1975 లో 75 సంవత్సరాల వయస్సులోనే గుండెపోటుతో మరణించాడు. రఘురామయ్య 1938లో బాపటాలలో రంగస్థల నటి ఆదోని లక్ష్మీని వివాహం చేసుకున్నారు. వీరికి ఐదుగురు సంతానం కాగా వారిలో ఇద్దరు రూపాదేవి, కళ్యాణం రామకృష్ణ తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు. రఘురామయ్య వారసత్వాన్ని పురస్కరించుకుని ఇటీవల ఆయన జన్మస్థలమైన సుద్దపల్లిలో ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading