కరోనా వైరస్ ఇప్పుడు అందరినీ పట్టి పీడిస్తుంది. ఈ తరుణంలో ముఖ్యంగా పెళ్లిల్లు, పంక్షన్లలలో పెట్టే ఖర్చు తలకు మంచిన భారం అవుతుందని మధ్య తరగతి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుట్టిన రోజు వంటి చిన్న వేడుకలకే వేలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెళ్లిళ్లకయ్యే ఖర్చు తలచుకుంటే సామాన్య మధ్యతరగతి కుటుంబాలు తలకు మించిన భారమే. ముఖ్యంగా ముస్లింల ఇంట్లో పెళ్లి అంటే ఆర్థికంగా భారమే అంటూ వాపోతున్నారు. తినుబండారాలు, కూరలు, వంటలు ఎక్కువగా ఖర్చు చేయడంతో వివాహ విందు ఖర్చు పెరిగిపోతున్నదని.. ఆడపిల్లలు కుటుంబాలు వాపోతున్నాయి. దీంతో ఆడపిల్లల కుటుంబాల కష్టాలను తీర్చడానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్లిం మత పెద్దలు సంచలన నిర్ణయమే తీసుకున్నారు.
Advertisement
Advertisement
వివరాల్లోకి వెళ్లితే.. తెలంగాణలోని వేములవాడ పట్టణంలోని మతపెద్దలందరూ కలిసి ఇక నుంచి పట్టణంలో ఎవరి పెళ్లికి అయినా సరే.. ఒకటే కూర.. ఒకటే స్వీటు.. ఉండాలని తీర్మానం చేశారు. సాధారణంగా ముస్లిం కుటుంబాల్లో అమ్మాయి తరుపు ఫ్యామిలీ పెళ్లి వేడుక సమయంలో చికెన్, మటన్‌తో సహా అనేక రకాల వంటలు పెట్టాల్సి వస్తుంది. బిర్యాని, చపాతి, రోటి కుర్బాని కా మీటా, ఖద్దూ కాకీర్, ఐస్ క్రీమ్, షేమియా షీర్ కుర్మా, ఇలా అనేక రకాల వంటకాలను విందు భోజనంలో ఏర్పాటు చేయాల్సిందే. అయితే కరోనా వైరస్ తరువాత ప్రతి ఒక్కరి ఆర్థిక స్థితి మారిపోయింది. వ్యాపారాలు సరిగ్గా జరగకపోవడంతో నష్టాలు చవిచూశారు. దీంతో గతంలో విందు భోజనం ఏర్పాటు చేయడం కష్టంగా మారింది.
ముఖ్యంగా ఆడపిల్లకు ఇచ్చే కట్న కానుకలతో పాటు విందు భోజనానికి అయ్యే ఖర్చులను పేద, మధ్య తరగతి వారు తట్టుకోలేక మత పెద్దలకు ఫిర్యాదు చేశారు. విందులో ఎంత తక్కువలో వెరైటీలు వడ్డించినా.. ఆ వెరైటీలు ఖర్చు భారీగానే అవుతుందని తాము ఈ భారాన్ని భరించలేకున్నాం అంటూ మమ్మల్ని ఒడ్డుకు చేర్చండంటూ పేద, సామాన్య కుటుంబాలు విజ్ఞప్తి చేశారు. పెళ్లిలో పెరుగుతున్న విందు ఖర్చును నియంత్రతించేందుకు వేములవాడలోని షాదిఖానాలో 8 మజీద్ కమిటీల పెద్దలు సమావేశమై.. ఇక పట్టణంలో జరిగే పెళ్లిల్ల విందులో భగారాతో పాటు ఒకటే కూర చికెన్ లేదా మటన్ మాత్రమే వడ్డించాలని తీర్మానం చేశారు. ఈ తీర్మాణం ఫిబ్రవరి 01వ తేదీ నుంచి అమలులోకి రానున్నదని తీర్పు చెప్పారు పెద్దలు.