మెగా ఇంట పెళ్లి సందడి ముగిసింది. ఈ ఏడాది జూన్ లో నిశ్చితార్థం చేసుకున్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నవంబర్ 1న మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. ఇటలీలోని టుస్కానీలో జరిగిన వీరి పెళ్లికి మెగా ఫ్యామిలీ, నితిన్, అల్లు అర్జున్ సన్నిహితులు కూడా హాజరయ్యారు. అక్టోబర్ 30న మొదలైన పెళ్లి వేడుకలు మూడు రోజుల పాటు ఘనంగా జరిగాయి. ఇటలీలో పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే.
Advertisement
పెళ్లి వేడుక తర్వాత ఇండస్ట్రీ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించారు. హైదరాబాద్ మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో నవంబర్ 5న రిసెప్షన్ వేడుక జరిగింది. ఈ ఫంక్షన్ లో టాలీవుడ్ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. అయితే లావణ్యతో పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ మొదటి ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. లావణ్య, వరుణ్ తేజ్ ఉన్న బ్లాక్ అండ్ వైట్ కలర్ ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇది చూసిన అభిమానులు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అన్నా అంటూ శుభాకాంక్షలు చెబుతున్నారు.
Advertisement
మరోవైపు వరుణ్ తేజ్ పెళ్లితో పాటు రిసెప్షన్ లో వరుణ్ తేజ్ ధరించిన చీర ధర ఎంత.. వరుణ్ తేజ్ ధరించిన డ్రెస్ ధర ఎంత.. రామ్ చరణ్ ధరించిన వాచ్ విలువ ఎంత అంటూ సోషల్ మీడియాలో రకరకాలుగా వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. వరుణ్ పెళ్లి నవంబర్ 01న జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు వారం రోజుల నుంచి వీరి పెళ్లి గురించి ఏదో ఒక వార్త వైరల్ కావడం విశేషం. ఇంకా ఎన్ని వార్తలు వైరల్ అవుతాయో వేచి చూడాలి మరీ.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!