మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇండస్ట్రీలో ఎవ్వరి సపోర్టు లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. అగ్ర హీరోగా ఎదిగిన తీరు ఎందరికో ఇన్ స్పిరేషన్ అనే చెప్పాలి. ఇండస్ట్రీలో కొత్తగా వచ్చిన వారు.. రవితేజను చూసి.. ఆయన ఎదుగుదలను చూసి తాము కూడా రవితేజలా అవ్వాలనుకుంటారు. రవితేజ కూడా ఈ మధ్యకాలంలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమాలు చేస్తున్నాడు. వాస్తవానికి రవితేజలో ఉన్న కామెడీ యాంగిల్.. ఆయన డైలాగ్ ఫ్లో చాలా మందికి నచ్చుతుంది . కిక్, వెంకీ వంటి సినిమాలు అద్భుతమైన విజయాన్ని సాధించాయి.
Advertisement
మాస్ మహారాజా నుంచి ఆడియన్స్ ఫైట్స్ కోరుకుంటారు. అదేవిధంగా కామెడీని కూడా కోరుకుంటారు. అయితే ప్రస్తుతం రవితేజ సీరియస్ పాత్రలో పైనే ఫోకస్ పెట్టాడు. ఆయన చివరి మూడు సినిమాలు చూస్తే.. కామెడీని పక్కన పెట్టి.. సీరియస్ పాత్రలపైనే ఫోకస్ చేసినట్టు తెలిసిపోతుంది. రావణసుర సినిమాలో అయితే మాస్ మహారాజా నెగిటివ్ షేడ్స్ లో కనిపించాడు. అదేవిధంగా ఇటీవలే వచ్చిన టైగర్ నాగేశ్వర్ రావు కూడా రవితేజ సీరియస్ లుక్ లోనే కనిపించాడు. రాబోయే ఈగల్ సినిమాలో రవితేజ సీరియస్ గానే కనిపించబోతున్నాడు. తాజాగా ఈగల్ మూవీ నుంచి టీజర్ విడుదలైంది.
Advertisement
ఈ టీజర్ చూసినట్టయితే.. రవితేజ గత సినిమాల మాదిరిగానే కామెడీని పక్కకు పెట్టి సీరియస్ లుక్ లోనే ఈగల్ మూవీ చేశాడని స్పష్టంగా అర్థం అవుతోంది. సమయం వచ్చినప్పుడల్లా కామెడీని ప్రయత్నం చేసే రవితేజ అక్మస్మాత్తుగా సీరియస్ పాత్రలను ఎందుకు చేస్తున్నాడనేప్రశ్నం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పటివరకు రవితేజ కామెడీ జోనర్ లో ఎన్ని సినిమాలు చేసినా.. తెలుగు ఆడియన్స్ పరిధి వరకు మాత్రమే వెల్లాడు. అదే పాన్ ఇండియా స్థాయిలో సీరియస్ కంటెంట్ తో సినిమాలు చేసి.. నార్త్ లో మార్కెట్ పెంచుకోవాలని రవితేజ చూస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే బ్యాట్ టూ బ్యాక్ సీరియస్ సినిమాల పాత్రలనే ఎంచుకుంటున్నట్టు సమాచారం.