లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చాలా మంది ఎన్నో పనులు చేస్తుంటారు. ఎంత చేసినా లక్ష్మీదేవి అనుగ్రహం మాత్రం పొందలేకపోతారు. లక్ష్మీదేవి అనుగ్రహం అనేది అంత ఈజీగా పొందేది కాదు. మనిషి అలవాట్లు, పవర్తన బట్టే అనుగ్రహం కూడా పొందే చాన్స్ ఉంటుంది. అందుకే చాణక్యుడు తన పుస్తకంలో వీటి గురించి చెప్పాడు. తన జీవితంలో జరిగిన అనుభవాలను పుస్తక రూపంలో చాణక్య నీతి రూపంలో తీసుకొచ్చాడు. తన అనుభవాల ద్వారా ఇతరులకు ఆయన మార్గదర్శనం చూపిస్తున్నాడు.
Advertisement
మంచి అలవాట్లు ఉంటే ఏమి జరుగుతుంది. చెడు అలవాట్ల వ్లల ఎటువంటి సమస్యలొస్తాయనే చాణక్యుడు తన పుస్తకంలో వివరింగా వెల్లడించారు. లక్ష్మీదేవికి ఎన్ని పూజలు చేసినా.. కొందరి దగ్గర అస్సలు ఉండదట. వాళ్లకు అనుగ్రహాన్ని ఇవ్వదు. అపరిశుభ్రత పరిసరాలుంటే లక్ష్మీదేవి అక్కడ అస్సలుండదు. ఇల్లును పరిశుభ్రంగా ఉంచుకోని వాళ్లు.. రోగాల బారిన వాళ్లు, స్నానం చేయని వాళ్లు, విడిచిన బట్టలనే ధరించే వారి వద్ద లక్ష్మీదేవి అస్సలుండదు.
Advertisement
అదేవిధంగా ఎప్పుడు ఇంట్లో గొడవలు జరుగుతుంటే లక్ష్మీదేవి నలవదు. అటువంటి ఇంట్లో అస్సలు లక్ష్మీదేవి తిష్ట వేయదు. లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే కచ్చితంగా ఆ ఇంట్లో ప్రేమ, స్నేహపూర్వక వాతావరణం ఉండాలి. కొందరూ పెద్దలను అవమానిస్తుంటారు. వృద్ధులను పట్టించుకోరు. అటువంటి ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదట. అందుకే పెద్దలను గౌరవించాలంటుంటారు. చేతగాని వాళ్లపై ప్రతాపం చూపించే వాళ్లను కూడా లక్ష్మీదేవి అనుగ్రహించదు. వృద్ధులను, పెద్దలను గౌరవించే వాళ్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి తాండవిస్తుందని చాణక్యనీతిలో చెప్పుకొచ్చారు.
Also Read: Today rasi phalalu in telugu : ఈ రాశి వారికి కలిసి వస్తుంది